ఇక నుండి ఇండియాకి ప్రత్యర్థిగా ఆడటమే ఈ భారత క్రికెటర్ లక్ష్యం అంట.!

ఇక నుండి ఇండియాకి ప్రత్యర్థిగా ఆడటమే ఈ భారత క్రికెటర్ లక్ష్యం అంట.!

by Mounika Singaluri

Ads

ఇండియాలో పుట్టి… అండర్ 19 లో ఇండియా తరఫున ఆడి కప్పు గెలిచిన ఇండియా ఆటగాడు ఇప్పుడు ఇకనుండి ఇండియాకి వ్యతిరేకంగా ఆడతానని ప్రకటించి సంచలనయ్యాడు. ఆ క్రికెటర్ పేరు ఉన్మక్త్ చంద్… 2012లో ఇండియా తరఫున అండర్ 19 వరల్డ్ కప్ కెప్టెన్ గా ఆడి ఇండియాకి కప్పు సాధించిపెట్టి అప్పట్లో హీరోగా నిలిచాడు.కానీ, ఆ తర్వాత అతను ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో టీమిండియాలో స్థానం దక్కలేదు.

Video Advertisement

తర్వాత కొన్నేళ క్రితం అమెరికాకు వెళ్లిపోయినా ఉన్ముక్త్‌ చంద్‌ అక్కడి దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాల్గొనేందుకు అతనికి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చంద్‌ మాట్లాడుతూ….భార‌త క్రికెట్ నుంచి బయటకి వచ్చాక…ఇప్పుడు భార‌త జ‌ట్టుకు ప్ర‌త్య‌ర్థిగా ఆడడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నా. అలాగ‌ని నాకు ఇండియాపై కోపం లేదు. ప్ర‌పంచంలోని బెస్ట్‌ టీమ్‌పై నా స‌త్తా నిరూపించుకోవాల‌నేది నా ఉద్దేశం అని చెప్పుకొచ్చాడు.

అయితే.. ఉన్ముక్త్‌ చంద్‌ ప్రస్తుతం అమెరికాకు తరఫున ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా జూన్ 12న న్యూయార్క్‌లో నాసౌ కౌంటీ స్టేడియంలో టీమిండియాతో అమెరికా జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మెగా టీ20 టోర్నీ వెస్టిండీస్‌-అమెరికా సంయుక్త వేదికగా జరగనుంది. వన్డే ప్రపంచకప్ ఓడిపోయిన భారత చెట్టు ఎలాగైనా టీ20 కప్ గెలవాలని కసిగా ఉంది. భారత అభిమానులు కూడా దీనిపైన అసలు పెట్టుకున్నారు. అయితే రోహిత్ కోహ్లీ తో పాటు పటిష్టమైన భారత ఆటగాళ్లు టీంలో ఉన్నారు. వీళ్ళందరికీ దీటుగా ఆడతానని ఉన్మాక్త్ చంద్ చేసిన కామెంట్లు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


End of Article

You may also like