శృతిమించుతున్న బుల్లితెర షోస్…చూడలేక చీర అడ్డు పెట్టుకున్న యాంకర్ సుమ.!

శృతిమించుతున్న బుల్లితెర షోస్…చూడలేక చీర అడ్డు పెట్టుకున్న యాంకర్ సుమ.!

by Mohana Priya

Ads

ఈ సమయంలో మనం బయటకు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఉంది కాబట్టి, ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా చూసేవి టీవీ ప్రోగ్రామ్స్. ఎన్ని ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వచ్చినా, యూట్యూబ్ లాంటివి ఎన్ని ఉన్నా కూడా టీవీ ఛానల్స్ కి ఉండే క్రేజే వేరు. ఇంకా వీకెండ్ వస్తే అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ వస్తాయి. కొన్ని ఛానల్స్ లో అయితే రాత్రి 9:30 తర్వాత రోజు ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ ఛానల్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

కానీ ఒకసారి ఎంటర్టైన్మెంట్ గ్రాఫ్ చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు ఛానల్స్ పెరిగాయి, ప్రోగ్రామ్స్ పెరిగాయి, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. కానీ వీటన్నిటితో పాటు కొన్ని అనవసరమైనవి కూడా వచ్చాయి. అప్పుడు కామెడీ ప్రోగ్రామ్స్ అంటే నిజంగా నవ్వొచ్చేది. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటే జడ్జెస్ మైక్ దగ్గరికి పెట్టుకొని నవ్వే అంత వరకు అవి జోక్స్ అని అర్థం అవ్వట్లేదు.

సరే. వాటి సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఆడియన్స్ కచ్చితంగా బ్రాడ్ మైండెడ్ అయ్యారు. అన్ని రకాల షోస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే బిగ్ బాస్ లాంటి కొత్త కాన్సెప్ట్ తెలుగులో కూడా ప్రయత్నించడానికి మా టీవీ యాజమాన్యం సాహసం చేశారు. ఆడియన్స్ కూడా వాళ్ల సాహసాన్ని అప్రిషియేట్ చేస్తూ బిగ్ బాస్ ని ఆదరిస్తున్నారు. బిగ్ బాస్ ఒకటే కాదు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, మీలో ఎవరు కోటీశ్వరుడు, వావ్, నంబర్ వన్ యారి, ఆలీతో సరదాగా, జబర్దస్త్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న షోస్ ని కూడా ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నారు.

కానీ కొన్ని ప్రోగ్రామ్స్ ఫార్మాట్ మారితే మాత్రం ప్రేక్షకులు అంత బాగా రిసీవ్ చేసుకోవట్లేదు. అంతకుముందు ఢీ ప్రోగ్రాం కేవలం డాన్స్ కి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు అందులో కూడా కామెడీ, అంటే కామెడీ లాంటి కామెడీ యాడ్ చేస్తున్నారు. సరే కామెడీ ఉన్నా పర్లేదు. కానీ మధ్యలో అప్పుడప్పుడు షోలో కొంచెం టాస్క్ లు అతిగా ఉంటాయి. అంటే అప్రిషియేట్ చేయడం వరకు బాగానే ఉంటుంది, కానీ కొంచెం అనవసరమైన చనువు ప్రదర్శిస్తే అప్పుడే షో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. కానీ ప్రేక్షకులు కంటెస్టెంట్స్ ఎంత టాలెంటెడ్ అనే విషయాన్ని మాత్రమే చూస్తున్నారు కాబట్టి మధ్య మధ్యలో వచ్చే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

representative image

కానీ ఇదే అలుసుగా తీసుకొని కొన్ని టీవీ ఛానల్స్ నిర్వహించే ప్రోగ్రాం లో కంటెంట్ కంటే ఎక్కువగా టిఆర్పీ కోసం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అనవసరమైన ఎలిమెంట్స్ పెడుతున్నారు. అందులో ఒకటి ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ జోడి. అసలు అది డాన్స్ షో నా, లేదా రియాలిటీ షో నా, లేదా మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ కంపాటిబిలిటీ టెస్ట్ చేసే షో నా ? షో టైటిల్ దేని ఆధారంగా ఇచ్చారు? అసలు ఆ షో ఉద్దేశం ఏంటి? ఏ కాన్సెప్ట్ తో షో డిజైన్ చేశారు? ఈ విషయాలన్నీ షో నిర్వాహకుల కి మాత్రమే తెలియాలి. ఇంకొకటి క్యాష్.

సాధారణంగా క్యాష్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దానికి కారణం, ఒకటి ఈ ప్రోగ్రాం కి సుమ యాంకర్, ఇంకొకటి క్యాష్ షో లో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. కానీ ఇటీవల విడుదలైన అప్ కమింగ్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే మాత్రం ఛానల్ యాజమాన్యం క్యాష్ ఎక్కువమంది చూడడానికి గల కారణాన్ని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఈ వారం క్యాష్ ప్రోగ్రాం లో ఇస్మార్ట్ జోడి లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది కపుల్స్ వస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ లో కొంచెం అతిగా ప్రదర్శించడం, దానిని చూసి సుమ చీరకొంగు అడ్డం పెట్టుకోవడం, అంతేకాకుండా ఏడు సంవత్సరాల క్రితం క్యాష్ ప్రోగ్రాం చేసినప్పుడు ఇలాంటివి ఏమీ లేవు అని అనడం. అసలు ఆడియన్స్ అందరికీ ప్రోమో చూస్తున్నంత సేపు “ఏంటి ఇది క్యాష్ ప్రోగ్రామ్ ఏనా?” అని అనిపించింది.

ప్రోమో చూస్తే టి ఆర్ పి కోసం జనాలని ఆకర్షించడానికి వాడే ఫార్ములా ప్రకారం డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఒకటి కాదు ప్రోమో లో ఎన్నో అనవసరమైన విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ షో డిజైన్ విషయంలో యాంకర్ లకి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ల పని యాంకరింగ్. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. ఏ కాన్సెప్ట్ అయినా ఇంట్రడ్యూస్ చేయాలంటే అది నిర్వాహకుల చేతిలోనే ఉంటుంది.

అంతేకాకుండా పైన చెప్పిన షోస్ లో టి ఆర్ పి కోసం ఏమి చేయరు అని కాదు. ఇప్పుడు సెలబ్రిటీలని తీసుకురావడం అనేది టీఆర్పీ కోసం చేసే పనే. కానీ ఈ విధానం హెల్తీ గా ఉంటుంది. అంటే షో చూడాలనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి జనాలు వీటి గురించి మాట్లాడుతున్న కూడా మంచిగానే మాట్లాడుకుంటారు. వైరల్ అయ్యేది కూడా మంచి విషయాలే అవుతాయి.

మంచి రెప్యుటేషన్ ఉన్న ఛానల్స్ కూడా ఈ విధంగా షో ఉద్దేశం పక్కన పెట్టి, కేవలం క్లిక్ బైట్స్ కోసం ఇలాంటి అనవసరమైన రూట్ ఫాలో అవుతుంటే కొన్నాళ్ళకి షో కి కాన్సెప్ట్ ముఖ్యం, కంటెంట్ ముఖ్యం అనే విషయాలు సెకండరీ అయిపోయి, కేవలం ప్రేక్షకులు ఒక షో గురించి మంచిగా అయినా, చెడుగా అయినా సరే మాట్లాడుకుని వైరల్ అవ్వడం మాత్రమే ముఖ్యం అనే ఆలోచనతో ప్రోగ్రామ్స్ వస్తాయేమో.


End of Article

You may also like