Ads
రాధే శ్యామ్ సినిమా నుండి మొదటి పాట ఇటీవల విడుదల అయ్యింది. ఈ పాటని జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచారు. యువన్ శంకర్ రాజా, హరిణి కలిసి ఈ పాటని పాడారు. అదే పాటలో సినిమా కథకు సంబంధించిన కొన్ని విషయాలని గ్రాఫిక్స్ రూపంలో చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 పాట మొదట్లో హీరోయిన్ ట్రైన్లో వెళుతూ ఉంటుంది. హీరో పక్కన కార్లో వెళ్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ కి హీరో చేయి అందిస్తాడు. హీరోయిన్ కారులో కూర్చోగానే ట్రైన్ ఎగిరి పడిపోతుంది. సినిమా టీజర్ లో మనకి హీరోకి మొత్తం తెలుస్తుంది అని చూపిస్తారు. అంటే హీరోయిన్ ప్రమాదంలో ఉంది అని ముందే తెలిసి, హీరో కాపాడాడు అన్నట్టు ఇందులో చూపించారు.
#2 తర్వాత హీరో, హీరోయిన్ కార్ ఒక స్టాచ్యూ మీది నుండి పాస్ అయ్యి, తర్వాత ఒక వైట్ కలర్ ట్యూబ్ మీద నడుస్తూ ఉంటుంది. అది స్టెతస్కోప్. ఇందులో హీరోయిన్ డాక్టర్ అని మనకి ఈ విధంగా చెప్పారు.
#3 అలాగే భూతద్దం కూడా చూపిస్తారు. ఇందులో హీరో జ్యోతిష్కుడు అని మనకి ముందే చెప్పారు కాబట్టి అదే విషయాన్ని ఈ విధంగా చెప్పారు.
#4 ఆ తర్వాత చేయి నీటిలో మునిగిపోవడం చూపిస్తారు. దాని మీద హీరో, హీరోయిన్ కార్లో వెళ్తూ ఉంటారు. ఇందులో హీరో పామిస్ట్. అంటే చెయ్యి చూసి జాతకం చెప్పేవాడు. ఆ చేయి నీటిలో మునిగిపోతుంది. అంటే హీరో, హీరోయిన్ ఏదో నీటికి సంబంధించిన ప్రమాదంలో విడిపోతారు అని అర్థం వచ్చేలా మనకి ఈ షాట్ చూపించారు.
#5 ఇందులోనే పడవ మీద ఒక జంట కూర్చుని ఉంటే పక్కనే కార్ లో హీరో, హీరోయిన్ కూర్చొని ఉంటారు. ఒక జన్మలో వీళ్లిద్దరు విడిపోతారు అని, మరొక జన్మలో మళ్ళీ పుడతారు అని దీని అర్థం.
#6 ఇందులో ఒక చోట హీరోయిన్ చేతికి మాలలాంటివి కట్టి ఉన్నట్టు కనిపిస్తాయి. మనకి టీజర్లో చూపించినప్పుడు ప్రభాస్ దగ్గర ఉన్న వస్తువుల్లో ఈ మాలలు కూడా ఒకటి. బహుశా అవి ఇవే అయి ఉండొచ్చు.
#7 అలాగే కార్ నీటిలో మునిగి పోయినప్పుడు హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా కనిపిస్తుంది. దాని మీద “విత్ లవ్ ప్రేరణ” అని రాసి ఉంటుంది.
#8 చివరలో ఆ ప్రమాదంలో కారులో నుండి బయటికి వచ్చిన హీరో హీరోయిన్, మళ్లీ నీటిలోనే కలుసుకోవడం చూపిస్తారు. అంటే హీరో హీరోయిన్ ఒక జన్మలో విడిపోయిన తర్వాత, కలుసుకుంటారు అని మళ్ళీ ఇంకొకసారి కూడా మనకి చెప్పారు.
ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలని మనకి ఈ ఒక్క పాటలోనే చూపించారు.
End of Article