Ads
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ ఇవాళ విడుదల అయ్యింది. అందరూ అనుకున్నట్టుగానే ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఈ టీజర్ ఉంది. ప్రస్తుతం అయితే, “అసలు సినిమా థియేటర్లలో ఎప్పుడు చూద్దామా?” అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న టీజర్ అయినా సరే అందులో చాలా వివరాలను సినిమా బృందం మనకు చెప్తుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 మొదటి షాట్ లో చూస్తే ఒక వ్యక్తి పులితో పరిగెడుతున్నట్లు కనిపిస్తాడు. అతను జూనియర్ ఎన్టీఆర్ అని మనందరికీ అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ కి, పులి కి మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుంది అని అన్నారు. బహుశా అది ఇదే అయి ఉండొచ్చు. లేదా ఇది జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయి ఉండొచ్చు.
ఇంకొక షాట్ లో జూనియర్ ఎన్టీఆర్ పరిగెత్తడం మనం చూడొచ్చు. ఇది కూడా పులి ఫైటింగ్ కి సంబంధించినది అయ్యి ఉండొచ్చు.
#2 ఇందులో రాహుల్ రామకృష్ణ మనకు రెండు షాట్స్ లో కనిపిస్తారు.జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో రాహుల్ రామకృష్ణ నటిస్తారు ఏమో అని ఇది చూస్తే అనిపిస్తుంది.
#3 అలాగే క్యారెక్టర్ కట్ అయిపోతుంది ఏమో అనుకున్న శ్రీయ కూడా ఇందులో కనిపిస్తున్నారు. శ్రీయ పక్కన ఉన్న బాబు కొమరం భీమ్ చిన్నప్పటి పాత్ర పోషించిన ఆర్టిస్ట్. దీన్ని బట్టి చూస్తే శ్రీయ, కొమరం భీమ్ తల్లి పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతుంది.
అజయ్ దేవగన్ కూడా ఇందులో ఒక షాట్ లో ఫైటింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్, కొమరం భీమ్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు.
రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఆలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఒలీవియా మోరిస్ కూడా ఒక షాట్ లో కనిపిస్తున్నారు.
#4 ఈ షాట్ సరిగ్గా గమనిస్తే, ఇక్కడ రామ్ చరణ్ పరిగెడుతున్నట్లు కనిపిస్తున్నారు. రామ్ చరణ్ ముందు ఒక వ్యక్తి పరిగెడుతున్నారు. టీజర్ లో చూపించిన షాట్స్ గమనిస్తే ఆ వ్యక్తి రాహుల్ రామకృష్ణ అయ్యి ఉండొచ్చు అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే దుస్తులు ఒకటేలాగా ఉన్నాయి.
#5 ఇది సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఒక ఫంక్షన్ అవుతోంది. అది కూడా బ్రిటిషర్లకు సంబంధించిన ఫంక్షన్. ఇది క్లైమాక్స్ లో వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఫౌంటెన్లని గమనించండి.
ఈ ఫొటోలో ఉన్న ఫౌంటెన్ తీసుకునే జూనియర్ ఎన్టీఆర్ దాడి చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు.
అదే సన్నివేశంలో పక్కనే రామ్ చరణ్ కూడా ఉన్నారు. అంటే ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి బ్రిటిషర్లపై ఫైట్ చేస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ షాట్ లో జూనియర్ ఎన్టీఆర్ పులి పంజాతో శత్రువులపై దాడి చేస్తూ ఉంటారు, అలాగే రామ్ చరణ్ కి గాయాలు అయ్యాయి. వెనక ఉన్న పరిసరాలు అంతా చూస్తే ఇది కూడా క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలలో జరిగేది అని మనకి అర్థమవుతుంది.
అలాగే చివరిలో పులి వచ్చి ఒక వ్యక్తి మీద దాడి చేస్తుంది. వెనకాలే ఒక జింక కూడా పరుగెడుతూ ఉంటుంది. సాధారణంగా బ్రిటిషర్లు జింక మాంసం తినేవారు అని అంటారు. కాబట్టి ఆ ఫంక్షన్ కోసం తీసుకొచ్చిన జింకలు అవే అని, దాడి జరగడంతో భయపడి పరిగెడుతున్నాయి అని అర్థమవుతుంది.
#6 ఈ ఫోటోలో రామ్ చరణ్ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. అలాగే రామ్ చరణ్ చేతికి పులిగోరు కూడా మనం గమనించవచ్చు.
#7 ఇందులో రామ్ చరణ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కలిపి ఒక తాడు కట్టి ఉంటుంది.
ఒక వ్యక్తి జెండా పట్టుకొని నీళ్లలోకి దూకి కనిపిస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు రామ్ చరణ్. అవతల పక్క జూనియర్ ఎన్టీఆర్ కూడా నీటిలోకి దూకుతూ ఉండటం, వారిద్దరికీ కలిపి తాడు కట్టి ఉండడం కూడా మనం గమనించవచ్చు. రామ్ చరణ్ దూకే వైపు సీతా రామరాజు వాడే గుర్రం, జూనియర్ ఎన్టీఆర్ దూకే వైపు కొమరం భీమ్ వాడే బైక్ కూడా ఈ సీన్ లో కనిపిస్తున్నాయి.
ఇక్కడ సరిగ్గా గమనిస్తే వారు ఇద్దరూ కలిసి బండిపై వెళ్తూ ఉంటారు. పోస్టర్లో మనకి విడుదల చేసిన స్టిల్ ఇదే.
#8 ఇక్కడ ఉండే సమూహం అంతా బ్రిటీషర్లకు చెందినవారు అని అర్థమవుతోంది. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా కొమరం భీమ్ నివసించే ప్రదేశం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
#9 ఇక్కడ పోలీసులు అందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. వీరందరూ ఎదురు చూసేది కొమరం భీమ్ కోసం అని సమాచారం. అంతే కాకుండా చుట్టూ ఆ ఊరికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు.
#10 ఈ షాట్ గమనిస్తే రామ్ చరణ్ పరిగెడుతున్నారు. కానీ చరణ్ బ్రిటిష్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు.
ఇవే కాకుండా ఇంకా చాలా వివరాలని ఈ టీజర్ లో మనకి సినిమా బృందం చెప్పింది. ఇవన్నీ చదివి ఒకసారి మళ్ళీ టీజర్ చూడండి. అంత చిన్న వీడియోలో ఇన్ని విషయాలని చెప్పేశారు అని మీకు కూడా అర్థమవుతుంది.
End of Article