Ads
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘ రాయ్ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఇందులో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Video Advertisement
అయితే, ఈ టీజర్ లో సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను చూపించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 టీజర్లో గమనించినట్లయితే ఈ సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు నిల్చొని ఉంటారు. వారిలో సాయి పల్లవి కూడా ఉన్నారు.
టీజర్ మొదట్లో ఒక చిన్నపిల్ల భయపడుతూ కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఆ అమ్మాయి పెద్దయిన తర్వాత సాయి పల్లవి అయ్యే అవకాశం ఉంది.
#2 ఇక్కడ నాని నుంచుని ఉంటే, ఎదురుకుండా కొంత మంది జనాలు కాగడాలు పట్టుకొని వస్తూ ఉంటారు. బహుశా ఇది ఏదైనా ఒక ఫైటింగ్ కి సంబంధించిన సీన్ అయి ఉండొచ్చు.
#3 ఇక్కడ కొంత మంది దేవదాసి ఆచారాన్ని ఆపేయాలి అని ధర్నా చేస్తూ ఉంటారు. అంటే ఈ సినిమాలో దేవదాసి పద్ధతిని చూపించారు. సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఒక దేవదాసిగా నటిస్తున్నారు అనే అనుమానం టీజర్ చూస్తే వస్తుంది.
#4 అలాగే ఈ పోస్టర్ లో నాని మీద ఎవరో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఇలా పెయింట్ చేసింది కూడా మనం గమనించవచ్చు.
#5 ఇక్కడ గమనిస్తే నాని కూర్చొని ఏదో రాస్తూ ఉంటారు. పక్కన ఒక క్యాలెండర్ ఉంటుంది. దాని మీద బెంగాల్ రైటర్స్ అసోసియేషన్ అని రాసి ఉంటుంది.
#6 ఇందులో నాని టైప్ మెషిన్ లో టైప్ చేస్తూ ఉంటారు. అందులో గాడ్ అండ్ హిస్ ప్రాస్టిట్యూట్స్ అని నాని టైప్ చేశారు. అంటే నాని కూడా దేవదాసికి వ్యతిరేకంగా పోరాడుతారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి, నాని ప్రేమకథ కూడా నడుస్తుంది అని అర్థమైపోతోంది.
#7 ఇక్కడ సాయి పల్లవి నీటిలో నుండి బయటికి వస్తూ ఉంటారు. ఇక్కడే నాని కూడా బైక్ దగ్గర కూర్చొని ఉన్నారు.
బహుశా లాస్ట్ లో చూపించే షాట్, అలాగే ఈ షాట్ ఒకటే సీన్ సంబంధించింది అయి ఉండొచ్చు.
అంతే కాకుండా మధ్యలో ఒక షాట్ లో ఒక నిప్పులు ఉన్న పడవ నీటిలో తేలుతున్నట్టు చూపిస్తారు. బహుశా ఈ పైన సీన్ లో నాని పక్కన పక్కన ఉన్న పడవ అదే అయ్యుండొచ్చు.
#8 ఇవన్నీ మాత్రమే కాకుండా, నాని మరొక గెటప్ లో కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నాని రెండు పాత్రలు పోషించబోతున్నారు అని ముందే చెప్పారు. రెండవ పాత్ర ఒక వీడియోగ్రాఫర్ అని మనకి ఈ షాట్ చూస్తే అర్థమవుతుంది. అంతే కాకుండా వెనకాల అమీద్ ఫాన్సీ స్టోర్ అని కూడా రాసింది. ఇది బహుశా హైదరాబాద్ లో జరిగే ఎపిసోడ్ అయ్యుండొచ్చు.
#9 మనకి మధ్య లో క్రెడిట్స్ పడేటప్పుడు వెనకాల ఒక లోగో, అందులో చెయ్యి, ఆ చేతిలో ఒక పెన్ను కూడా కనిపిస్తూ ఉంటాయి.
#10 ఇవన్నీ మాత్రమే కాకుండా టీజర్ లో మరొక హీరోయిన్ అయిన క్రితి శెట్టి, అలాగే ముఖ్య పాత్రలో నటిస్తున్న రాహుల్ రవీంద్రన్ కూడా కనిపిస్తారు.
అయితే ఈ సినిమా ఒక భాగం మొత్తం స్వతంత్రం రాకముందు, మరొక భాగం మొత్తం ఇప్పటి నేపథ్యంలో నడుస్తుంది అని మనకి టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
End of Article