Ads
విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమాకి ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన హిట్ సినిమా సీక్వెల్ గా రూపొందిన హిట్ 2 సినిమా దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వీడియో ఇటీవల విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. ఈ వీడియో చూస్తూ ఉంటే సినిమాలో యాక్షన్ ఉంటుంది అని అర్థం అయిపోతుంది.
Video Advertisement
వెంకటేష్ ని ఇలాంటి ఒక యాక్షన్ సినిమాలో చూసి చాలా రోజులు అయింది. ఎలాంటి పాత్రని అయినా సరే వెంకటేష్ చాలా సులభంగా చేయగలుగుతారు. దాంతో ఇప్పుడు ఈ పాత్ర ఎలా చేస్తారా? సినిమా ఎలా ఉంటుందా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తారు అని అంటున్నారు. అయితే ఈ సినిమా వీడియో ఒకటి విడుదల చేశారు. అందులో సినిమా స్టోరీ గురించి చాలా విషయాలని చెప్పారు.
#1 సినిమా వీడియో మొదట్లో చంద్రప్రస్థలో ఒకచోట అని చూపిస్తారు. చంద్రప్రస్థ అంటే ఇంద్రప్రస్థకి క్యాపిటల్. అంటే ఢిల్లీ. కానీ ఢిల్లీలో పోర్ట్ అయితే ఉండదు. అలాగే మళ్లీ సౌత్ ఇండియాలో ఒక చోట అని కూడా చెప్పారు. సినిమాలో బైక్ మీద కూడా CP అని ఉంటుంది.
#2 సినిమా టైటిల్ సైంధవ్. సైంధవుడు అంటే మహాభారత పురాణాల ప్రకారం పద్మవ్యూహంలోకి వెళుతున్న పాండవులను ఆపి వారిని వెళ్లనివ్వకుండా ప్రయత్నించిన రాజు. మరి హీరో పాత్రకి ఆ పేరు ఎందుకు పెట్టారో? ఒకవేళ హీరో పాత్రలో కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయా అని అంటున్నారు.
#3 ఈ వీడియోలో వెంకటేష్ ఒక మెడిసిన్ తీస్తూ ఉంటారు. ఆ మెడిసిన్ పేరు ఒనాసెమ్నోజీన్ అబెపర్వోవెక్ (onaasemnogene abeparvovec). ఇది భారతదేశ కరెన్సీ ప్రకారం చాలా కోట్ల ఖరీదు ఉంటుంది. ఈ మెడిసిన్ ని చిన్న పిల్లల్లో వచ్చే వెన్నెముక కండరాల సమస్యలని దూరం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మెడిసిన్ ఎక్కడికో రవాణా అవుతూ ఉంటే హీరో పట్టుకున్నారు అని అర్థం అవుతోంది.
#4 కానీ హీరో పేరు పెట్టడం వెనుక, అలాగే చూపించిన చోటు కూడా సినిమాలో హీరో పాత్ర మొత్తం పాజిటివ్ షేడ్స్ ఉండవు ఏమో అని అనిపించేలాగా ఉంది. సాధారణంగా ఈ మధ్య హీరోలని పూర్తిగా మంచి వారిగా చూపించడం తగ్గిపోయింది. హీరో అన్న తర్వాత వాళ్లు కూడా కొన్ని తప్పులు చేస్తారు. వాళ్లకి కూడా కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి అని చూపిస్తున్నారు.
మరి ఈ సినిమాలో వెంకటేష్ కూడా కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారేమో అని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ వీడియో చూశాక సోషల్ మీడియా అంతా ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమాకి సంబంధించి సినిమా బృందం టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేసేంత వరకు ఆగాల్సిందే.
watch video :
End of Article