ఇప్పటి వరకు చూడని యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” అరుదైన ఫోటోలు..!

ఇప్పటి వరకు చూడని యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” అరుదైన ఫోటోలు..!

by kavitha

ప్రభాస్, ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అయితే అది అంత తేలికగా జరుగలేదు. పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడింది. కానీ స్టార్ స్టేటస్ ను ఇవ్వలేకపోయింది.

Video Advertisement

ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అభిమానులు ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ అరుదైన, ఇప్పటివరకు ఎవరు చూడని ఫోటోలు ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు మరియు నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కుమారుడు. పెదనాన్న వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయానికి కృష్ణంరాజు ఫేడ్ అవుట్ కావడంతో ఆయన క్రేజ్ ప్రభాస్ కు అంతగా పనిచేయలేకపోయింది. 2002 లో ఈశ్వర్ తో ప్రభాస్ హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. రెండవ మూవీ రాఘవేంద్ర ఫ్లాప్ గా నిలిచింది. 2004లో వచ్చిన వర్షం మూవీతో ఫస్ట్ హిట్ ను ప్రభాస్ అందుకున్నారు.prabhasఆ తరువాత అడివి రాముడు, చక్రం చిత్రాలు నిరాశ పరిచాయి. అదే సమయంలో అల్లు అర్జున్, రవితేజ విజయాలతో  దూసుకుపోతున్నారు. దాంతో ప్రభాస్ వైపు చూసేవారు లేకుండాపోయారు. సరిగ్గా ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ మూవీతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో విజయాలతో దూసుకెళ్లాడు.
మిర్చి మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మాస్ బ్లాక్ బస్టర్ ను కొరటాల శివ అందించారు. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్, తాజాగా సలార్ తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ రేర్, అన్ సీన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..

1.
2.3.4. 5.6.
7.8.9. 10.11. 12.13.14.15.16.Also Read: “పూజా హెగ్డే” కంటే ముందు… “సల్మాన్ ఖాన్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 13 మంది హీరోయిన్స్..!

 


You may also like

Leave a Comment