ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ మృతి చెందారు . కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా గ్యాస్ట్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ల నేతృత్త్వంలో చికిత్స జరిగింది.

Video Advertisement

అయితే ఆదివారం ఆనంద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంచింది. దీంతో ఆయనను ఆదివారం సాయంత్రం వెంటిలేటర్ పై ఉంచారు. వెంటిలేటర్ పై ఉన్న ఆనంద్ సింగ్ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ఆదివారం యోగి ఆదిత్యనాధ్ తండ్రిని ఐసీయూ వార్డ్ కి తరలించే ముందు ఆయనకు డయాలసిస్ కూడా నిర్వహించినట్లు ఎయిమ్స్ వెల్లడించింది ..

ఇంతకుముందు డీహైడ్రేషన్ తో బాధపడుతూ కొన్ని నెలల క్రితం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..డెహ్రాడూన్ లోని ఓ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ఆనంద్ సింగ్ ఫారెస్ట్ రేంజర్ గా గతంలో విధులను నిర్వర్తించారు . ఆగస్టు-8,1948న జన్మంచిన ఆనంద్ సింగ్ బిస్త్ కు నలుగురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఆనంద్ బిస్త్ కు రెండవ కుమారుడు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్.

కరోనా ను అదుపు చేయడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా తన తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు సైతం వెళ్ల‌డం లేద‌ని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్. తండ్రిని కడసారి చూడటం కంటే కూడా నాకు 23 కోట్ల మంది ప్రజల క్షేమం ముఖ్యం .ప్రస్తుత విపత్కర పరిస్థితులలో నేను నా విధులు నిర్వర్తించడం చాలా అవసరం అందుకే తండ్రిని చూసేందుకు వెళ్లడం లేదని యోగి ఆదిత్యనాధ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు . యోగి ఆదిత్యనాధ్ తండ్రి వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన సోమ‌వారం ఉదయం తుదిశ్వాస విడిచారు. త‌ల్లి, స్నేహితులు అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మం చూడాల‌ని కోరుతున్నాన‌ని యోగి ఆదిత్యనాధ్ అన్నారు .