బతకలేక బడి పంతులు అనేవారు ఒకప్పుడు…కానీ ఇప్పుడో టీచర్ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ప్రైవేట్ టీచర్ల దుస్థితి కాసేపు పక్కన పెడదాం.. కానీ ఒక టీచర్ 13 నెలల్లో కోటి రూపాయలు జీతం సంపాదించింది.. అంటే నమ్ముతారా? నాన్సెన్స్ అంటూ కొట్టిపారేయకండి..ఇది నమ్మితీరాల్సిన నిజం..  ఎక్కడండీ??  ఏ స్కూల్లో అంత జీతం ఇస్తున్నారో చెప్తే ఎవరి కాళ్లావేళ్లైనా పడి ఉద్యోగం సంపాదిస్తాం అని మాటా మారుస్తారా.. అసలింతకీ ఆ టీచరెవరూ..అంత డబ్బు ఎలా సంపాదంచిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..

Video Advertisement

representative image

ఉత్తర ప్రదేశ్ కి చెందిన అనామిక శుక్లా అనే మహిళ, కస్తూర్భా బాలిక విద్యాలయం లో టీచరుగా పోస్టింగ్ అందుకుంది.. ఈ  ప్రభుత్వ టీచరు గత 13నెలల్లో కోటి రూపాయలు జీతాన్ని సంపాదించింది. అది కూడా 25స్కూళ్లల్లో ఏకకాలంలో  ఉద్యోగం చేసి మరీ.. ఇదెక్కడి చోద్యం ..ఒక ప్రభుత్వ టీచర్ ఏకకాలంలో 25 స్కూళ్లల్లో ఎలా ఉద్యోగం చేస్తుంది.. అంటే చేయొచ్చు..మోసం చేయడం ద్వారా సంపాదించొచ్చు.

representative image

సైన్స్ టీచరుగా పనిచేస్తోన్న అనామిక తన క్రిమినల్ మైండ్ తో అందరి కళ్లు కప్పి 25 స్కూళ్ల నుంచి జీతం తీసుకుంటోంది. ఈమె పదమూడు నెలలుగా 25 స్కూళ్లకి సంబందించిన అకౌంట్స్ నుండి జీతం డ్రా చేసింది. ఈ పదమూడు నెలల కాలంలో ఆమె ఎవరికి దొరకపోవడం ఆశ్చర్యం అయితే…మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె  బయోమెట్రిక్ యంత్రాలకు కూడా చిక్కక్కుండా తప్పించుకుంటోంది.

representative image

అసలు విషయం బయటపడిందిలా…

టీచర్ల డేటాబేస్ ను సిద్ధం చేస్తుంటే 25 స్కూళ్లలో ఒకటే పేరు కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది..దాంతో తీగ లాగితే డొంక కదిలిన చందానా ఈమె వ్యవహారం బయటపడింది..మొత్తం 25స్కూళ్లల్లో ఆమె రికార్డులు ఉండడం, ఆమె ఇలా అందరిని ఎలా మాయ చేయగలిగిందో అర్దం కాక తలలు పట్టుకోవడం అధికారుల వంతు అయింది..

representative image

ఆమె సంపాదించిన కోటి విషయాన్ని పక్కన పెట్టి, అసలు బయోమెట్రిక్ ని ఎలా మానేజ్ చేసింది, స్కూల్ రికార్డ్స్ లో పేరు ఎలా రికార్డ్ చేయించింది ..అధికారులను ఇంతకాలం ఎలా మోసం చేసింది అనే దిశలో దర్యాప్తు చేస్తున్నారు..సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారిన అనామిక వ్యవహారం పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నరు.. ప్రభుత్వవ్యవస్థలు ఎంత కళ్లుమూసుకుని పని చేస్తాయో అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటూ నెటిజన్ కామెంట్ చేసారు..