Home Filmy Adda Upasana: నా బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్ తో నేనూ బాధపడ్డాను..!

Upasana: నా బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్ తో నేనూ బాధపడ్డాను..!

by Megha Varna

మెగా కోడలిగా, రామ్ చరణ్ తేజ్ భార్యగా మాత్రమే కాకుండా ఉపాసన కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఎప్పుడూ ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలను, చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఉపాసనని చూసినవాళ్లు తన లైఫ్ లో ఎలాంటి కష్టాలు పడలేదేమో అని అనుకుంటూ ఉంటారు.

Healthcare entrepreneur Upasana Kamineni Konidela discusses her approach to food and fitness

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంటుందని.. అయితే ఎవరి కష్టాలు వాళ్ళవని.. వారి యొక్క బాధకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఉపాసన చెప్పారు. లైఫ్ అనేది నిజంగా ఒక టాస్క్ అని అది అంత ఈజీగా ఉండదని కూడా ఆమె అన్నారు. తాను కూడా ఒకానొక సమయంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నానని అన్నారు.

Upasana Konidela Wants To Remain A Classic - IndustryHit.Com

లడ్డు అని బాడీ షేమింగ్ పై వచ్చిన కామెంట్స్ తనను ఎంతగానో బాధ పెట్టాయని అన్నారు. ఇప్పుడు మాత్రం చాలా మంది బాగున్నావ్ అని చెబుతూ ఉంటారని.. కాంప్లిమెంట్స్ ఇస్తారని అన్నారు. కానీ వాటిని తీసుకోలేక పోతున్నానని ఆమె చెప్పారు.

ఇలా మారడానికి గంటలు గంటలు వర్కౌట్స్ చేశానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య బేధాభిప్రాయాలు అనాసరమని అన్నారు. పైగా ఎవరి బలం వాళ్ళదన్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్జెండర్ అని ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్నారు.

You may also like