రామ్ చరణ్ బర్త్ డే కి ఉపాసన సర్ప్రైస్ గిఫ్ట్ ఇదే…ఆ వీడియో చూసి..?

రామ్ చరణ్ బర్త్ డే కి ఉపాసన సర్ప్రైస్ గిఫ్ట్ ఇదే…ఆ వీడియో చూసి..?

by Megha Varna

Ads

చిరంజీవి తనయుడిగా పరిచమైనప్పటికీ తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు. దేశంలో కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ఇంట్లోనే సాదాసీదాగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవలసి వచ్చింది చెర్రీ . సోషల్ డిస్టెన్స్ కారణంగా తనని ఎవరు కలవడానికి రావద్దు అని తెలిపారు చెర్రీ .

Video Advertisement

అభిమానులు ప్రజలు ఎట్టి పరిస్థితులలోను బయటకు రాకూడదని, సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరు పాటించాలని ఇదే మీరు నాకిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని చరణ్ అన్నారు. దీనితో అభిమానులే కాదు బంధువులు కూడా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపలేదు. సహ నటులు డైరెక్టర్ లు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు అభిమానాలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగానే విష్ చేసారు. ఈ క్రమంలో రాంచరణ్ కు తన భార్య ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటి అంటే?

బయట తయారు చేయించిన కేకులు కాకుండా చెర్రీ బర్త్ డే కోసం ఉపాసన స్వయంగా తన స్వహస్తాలతో రెండు విభిన్న కేకులను తయారు చేసి వాటిపై పండ్లతో RC అని వచ్చేలా డిజైన్ చేసారు . ఆ కేక్ ని కట్ చేసి రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నారు .చరణ్ కేక్  కట్ చేసిన ఫోటోలు ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చెయ్యగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ఉపాసన కేక్ ని సొంతంగా తయారు చేసే క్రమంలో తీసిన వీడియోని తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసినట్లు ఉపాసన తెలిపారు.

చెర్రీ బర్త్డే సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ క్యారక్టర్ ని ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ తో పవర్ ఫుల్ గా బీమ్ ఫర్ రామరాజు పేరుతొ తన ఫస్ట్ లుక్ ను , క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేసి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా అల్లూరి రామరాజు గురించి చెప్తూ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇంపాక్ట్ హైలైట్ గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు .

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే కాగా తెలంగాణ  వీరుడు కొమరం బీమ్ పాత్రలో ఎన్టీఆర్, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది.

watch video:


End of Article

You may also like