లాక్ డౌన్ వేళ ఇలా చేయడానికి ఎంత మంది హీరోయిన్లకి ధైర్యం ఉంటుంది..? హ్యాట్సాఫ్ ఉపాసన మేడం!

లాక్ డౌన్ వేళ ఇలా చేయడానికి ఎంత మంది హీరోయిన్లకి ధైర్యం ఉంటుంది..? హ్యాట్సాఫ్ ఉపాసన మేడం!

by Megha Varna

లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీల దాక అంతా ఇళ్లకే పరిమితం అయ్యినా విషయం తెలిసిందే.ఈ లాక్ డౌన్ లో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా టైమ్ పాస్ చేస్తున్నారు.ఇప్పటికే ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించాలని చాలామంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ లాక్ డౌన్ సమయంలో చాలామంది హీరోయిన్ లు ఇంటి పట్టున ఉంటూ రకరకాల వంటకాలు చేస్తూ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.కాగా హీరోలు దర్శకులు సైతం ఇంట్లో పనులు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యి అంతటా సదరు విషయలపై చర్చలు జరుగుతున్నాయి..

Video Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య, మెగా కోడలు ఉపాసన అపోలో సంస్థలో కీలక పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఉపాసన ఎప్పుడూ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ రామ్ చరణ్ తేజ్ గురించి తాజా సమాచారన్ని పంచుకుంటూ ఆమె వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు . కాగా ఇంట్లో ఉండే ఆహార పదార్ధాలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అనే విషయాలను షేర్ చేస్తూ ఉంటారు ఉపాసన.తాజాగా లాక్ డౌన్ లో మూగజీవాలు అయిన కుక్కల వలన కరోనా వైరస్ వస్తుందని తప్పుగా ప్రచారం జరగడంతో చాలామంది పెంపుడు కుక్కలను రోడ్ల మీద వదిలేస్తున్నారని వాటికీ ఆహారం నీరు దొరకక ఇబ్బంది పడుతున్నాయని ఆలా ఎవరు చెయ్యద్దని ఉపాసన ఆవేదన వ్యక్తం చేసారు.కాగా అలంటి మూగజీవాలకు స్వయంగా ఉపాసన నే ఆహారం అందించారు.

 

లాక్ డౌన్ లో ఉపాసన తన సమయాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఉపాసన పల్లె వాతావరణంలో ఉంటూ అధునాతన వ్యవసాయం నేర్చుకుంటున్నారు.వ్యర్ధ పదార్ధాలను ఉపయోగించి సేంద్రియ ఎరువును తయారుచేయడం ఎలానో నేర్చుకుంటున్నారు.పశువులకు కూడా తానే స్వయంగా ఆహారం అందిస్తూ పేడ ఎత్తుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఉపాసన.సాధారణంగా పల్లె వాతావరణంలో జీవించడం అలవాటు చేసుకుంటున్నాను అని తెలిపారు ఉపాసన . కాగా హీరో మహేష్ బాబు నమ్రత స్పందిస్తూ ….చాలా మంచి అమ్మాయి అని కితాబిచ్చారు.ఉపాసన ఎప్పుడూ కూడా సమాజానికి ఏదో ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు …

 


You may also like