Ads
ప్రస్తుతం వరుస పాన్-ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న నటులలో ఒకరు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా నటిస్తారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.
Video Advertisement
రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా వ్యాపార రంగానికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు.
ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల ఉపాసన గణేష్ నిమజ్జనం వేడుకల్లో కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో ఉపాసనని గమనిస్తే ఉపాసన తల్లి కాబోతున్నారు అనే విధంగా ఆ ఫోటోలు ఉన్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ అవడంతో చాలా మంది నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటివరకు అయితే రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ స్పందించలేదు. గతంలో కూడా ఈ విషయంపై చాలా ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగగా, అందుకు ఉపాసన పిల్లల్ని కనడం అనేది వారి ఇష్టం అని, అది వారి వ్యక్తిగత విషయం అని చెప్పారు. చాలా మంది నెటిజన్లు కూడా ఉపాసనకి మద్దతు తెలుపుతూ అది నిజంగా వారి వ్యక్తిగత విషయం అని, అలాంటి విషయాలపై ప్రశ్నలు అడగడం కూడా కరెక్ట్ కాదు అని అన్నారు.
ఉపాసన సెప్టెంబర్ 4వ తేదీ ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో ఉపాసన మామూలుగానే కనిపిస్తున్నారు. కానీ నిన్న పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం ఉపాసన ఎలా ఉన్నారు దాంతో ఉపాసన తల్లి కాబోతున్నారు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో అలాంటిది ఏమీ లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఫోటోలపై వారి స్పందిస్తారో లేదో అనేది చూడాలి.
End of Article