Ads
కరోనా వైరస్ దాటికి జనమంతా బయందలోనలతో గడుపుతున్నారు . రోజు రోజుకి పరిస్థితి చేజారిపోతుంది .ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 400 లకు పైగా నమోదు అయ్యాయి .కరోనా ప్రభావం వలన ఉభయ తెలుగు రాష్ట్రాలలోను పరిస్థితిలు చాల క్లిష్టంగా తయారు అయ్యాయి కరోనా ను అదుపు చెయ్యడానికి ప్రభుత్వం తీసుకున్న లోక్ డౌన్ చర్యల వల్ల ప్రజలంతా ఇంటికే పరిమితం అయిపోయారు . దీని వలన కరోనా వ్యాప్తి చెందడం కొంచెం అదుపు అయినట్లుగా కనిపిస్తుంది .
Video Advertisement
అయితే కరోనా మహమ్మరి వలన తీసుకున్న లాక్ డౌన్ చర్యల వలన సోషల్ మీడియా లోను వాట్సాప్ లోను వాస్తవాల కంటే కూడా రుమార్సే ఎక్కువగా ప్రచారం కావడం వలన ఏది నిజమో ఏది ఫేక్ అని తెలియక తెలియక జనం సతమతం అవుతున్నారు . ప్రజలను భయాందోళనకు గురి చేసి వార్తలే ఎక్కువే ప్రచారం కావడం వలన జనాలు ఆందోళన చెందుతున్నారు .ఈ నేపథ్యంలో పెంపుడు జంతువుల వలన కరోనా వ్యాప్తి చెందుతూనే దుష్ఫ్రచారం చేయడం వల్ల వాటిని అనాధల్లా రోడ్ మీద వదిలేస్తున్నారు .
పెంపుడు జంతువులైన ముఖ్యంగా కుక్కలా వల్ల కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న రూమర్స్ రావడంతో చాల మంది కుక్కలను వీధుల్లోనే వదిలేస్తున్నారు .దీంతో కొంతమంది వాటిపై కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు . అయితే వీటిలో నిజం లేదని పెంపుడు జంతువుల వలన కరోనా రాదని ఎంత చెప్తున్నా ఎవరు వినడం లేదు .
మూగజీవాల పట్ల ప్రేమను చూపించండి అని యాంకర్ రష్మీ కోరుకున్న విషయం తెలిసిందే .రోడ్ మీద అనదల్లా మిగిలిన వాటికీ ఆహారం అందించడానికి తానే స్వయంగా రంగంలోకి దిగింది .స్వచ్చంద సంస్థతో కలిసి మూగ జీవుల సంరక్షణార్థం బయలు దేరింది .
లేటెస్ట్ గా హీరో రాంచరణ్ భార్య ఉపాసన స్పందిస్తూ ……నా డార్లింగ్ డైసీ స్వీయ నిర్బంధం వర్తించదు ..మూగ జీవాల పట్ల మీరెంత ప్రేమను చూపిస్తారో తెలిపే సమయం ఇది .మనసు లేని కొందరు వాటిని నిర్దాక్షణంగా వీధులలోనే వదిలేస్తున్నారు ..అది అత్యంత దారుణమైన చర్య .మూగజీవాల పట్ల మీరు చూపే ప్రేమే మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు .దానిపై నెటిజన్లు స్పందిస్తూ ఉపాసన మీరు చేసిన ఈ పోస్ట్ వలన మీరెంతో మంచి హృదయం కలవరో తెలుస్తుంది ..మీరు మూగ జీవాల పట్ల చూపిస్తున్న ప్రేమ రియల్లీ గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు …
Self isolation doesn’t apply to my darling daisy. This is the best time to show pets, how much u love & care about them. Some cruel people have been abandoning their pets during this time. The love & care u show towards ur pets speaks volumes about ur personality. pic.twitter.com/uqPfYy1HlD
— Upasana Konidela (@upasanakonidela) April 1, 2020
End of Article