తెలంగాణా: ధరణి లో మీ ఆస్తులు వివరాలు ఆన్లైన్ లో ఇలా నమోదు చేసుకోండి.

తెలంగాణా: ధరణి లో మీ ఆస్తులు వివరాలు ఆన్లైన్ లో ఇలా నమోదు చేసుకోండి.

by Mohana Priya

Ads

తెలంగాణ రాష్ట్రంలోని భూములకు సంబంధించిన అన్ని రికార్డులను యాక్సెస్ చేయడానికి ప్లాట్ ఫాం అయిన ధరణి పోర్టల్ విజయదశమి రోజు ప్రారంభించబడుతుంది. ఈ పోర్టల్ ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్లు డెవలప్ చేశారు. సెప్టెంబర్ 8 వ తేదీ నుండి నిలిచిపోయిన ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని ఈ పోర్టల్ ద్వారా తిరిగి ప్రారంభిస్తారు. విజయదశమి లోపు పోర్టల్ కి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Video Advertisement

DHARANI REGISTRATION ONLINE

DHARANI REGISTRATION ONLINE

అంతేకాకుండా తహసీల్దార్లకు, డిప్యూటీ తహసిల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు మారిన రిజిస్ట్రేషన్ పద్ధతి లో ఆన్లైన్లో వివరాలన్నిటినీ తొందరగా అప్డేట్ చేయడానికి శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయిస్తామని కేసీఆర్ తెలిపారు. దసరా లోపు ప్రాపర్టీ లకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని అధికారులను కోరారు కేసీఆర్. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభిస్తున్నారు కాబట్టి అదే రోజు రిజిస్ట్రేషన్స్ కూడా మొదలుపెడతారు.

DHARANI REGISTRATION ONLINE

DHARANI REGISTRATION ONLINE

ఈ సమయంలో వివరాల కోసం అధికారులు ప్రతి ఇంటికి వెళ్లలేరు. కాబట్టి ఆస్తుల వివరాలను యజమానులే అప్లోడ్ చేయవచ్చట. ప్రాపర్టీ టాక్స్ చెల్లింపుదారుల మొబైల్ నెంబర్ కి మీ సేవ పోర్టల్ ఒక లింక్ పంపుతోంది. ఈ లింకు ద్వారా ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ లో అప్లోడ్ చేసే సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం.

DHARANI REGISTRATION ONLINE

DHARANI REGISTRATION ONLINE

ఇలా అప్లోడ్ చేసిన వివరాలు ధరణి పోర్టల్‌ తో పాటు సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్, పంచాయతీ అధికారులు కూడా తెలుస్తాయట. దాంతో అధికారులు ఇళ్లకు వచ్చే పని లేకుండా వివరాలు అప్లోడ్ చేయవచ్చు. అంతే కాకుండా ఒక వేళ ఏదైనా సమాచారం లోపం ఉండి వెరిఫై చేసుకోవడానికి అధికారులు వచ్చినా, యజమానులు వివరాలను అప్లోడ్ చేశాం అని చెప్తే అధికారులు వెనుతిరుగుతారట.

ధరణి పోర్టల్ లింక్ ఇదే..

Know your application status Link >> Click Here

Check Your Land Details Link >> Click Her

Telangana Dharani official website Link >> Click Here

Check Land Records in Dharani App >>Click Here

 


End of Article

You may also like