తండ్రీకొడుకుల మల్టీ స్టారర్ లో ఉప్పెన బ్యూటీ “కృతి శెట్టి”.

తండ్రీకొడుకుల మల్టీ స్టారర్ లో ఉప్పెన బ్యూటీ “కృతి శెట్టి”.

by Megha Varna

Ads

“సోగ్గాడే చిన్నినాయనా” సీక్వెల్‌గా రాబోతున్న “బంగార్రాజు” సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభ‌మైంద‌ంటూ మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో రెండు వైపులా రెండు బుల్లెట్ బైక్స్ క‌నిపిస్తుండ‌గా.. బ్యాక్ డ్రాప్‌లో ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. “సోగ్గాడే చిన్నినాయనా” కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ గారే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Video Advertisement

మనం తర్వాత తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఇది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక నాగచైతన్యకు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా లో జాయిన్ అయినందుకు సంతోషంగా ఉంది అంటూ కృతి శెట్టి ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేసారు.

ఈ సినిమాలో చలపతి రావు ,బ్రహ్మాజీ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.


End of Article

You may also like