Ads
- చిత్రం : ఉప్పెన
- నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి, విజయ్ సేతుపతి.
- నిర్మాతలు : నవీన్ యేర్నేని, వై రవి శంకర్, సుకుమార్
- దర్శకత్వం : బుచ్చి బాబు సానా
- సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2021
కథ :
Video Advertisement
ఆసి (పంజా వైష్ణవ్ తేజ్) కి, సంగీత అలియాస్ బేబమ్మ (క్రితి శెట్టి) కి జరిగే ప్రేమ కథ ఉప్పెన. తన పరువు మర్యాదలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రాయనం (విజయ్ సేతుపతి) ఏం చేశాడు? తన కూతురు ప్రేమని ఒప్పుకున్నాడా? చివరికి ఆసి, బేబమ్మ కలిసారా? ఇవన్నీ తెలియాలంటే ఉప్పెన సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
గత ఏడాది విడుదల అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. కానీ సినిమా గురించి ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా మధ్యలో పాటలను విడుదల చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంచెం హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో కూడా పాటలు అంతే బాగా పిక్చరైజ్ చేశారు. స్టొరీతో పాటు పాటలు కూడా అలా వెళ్లిపోతాయి. దేవి శ్రీ ప్రసాద్ ఉప్పెన సినిమాకి తెరవెనుక హీరో అని చెప్పొచ్చు.
ఇంక పర్ఫామెన్స్ ల విషయానికొస్తే, మొదటి సినిమా అయినా కూడా హీరో, హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా నటించారు. మొదటి సినిమాకి చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ ఎంచుకున్నారు వైష్ణవ్ తేజ్. హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన అతను, అలాగే మిగిలిన ముఖ్య పాత్ర పోషించిన నటులు కూడా బాగా యాక్ట్ చేశారు.
ఇంక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెగిటివ్ రోల్ అయినా, పాజిటివ్ రోల్ అయినా విజయ్ సేతుపతి తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు. ఈ సినిమాకి కూడా ఒక మేజర్ హైలైట్ గా నిలుస్తారు విజయ్ సేతుపతి.
సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చి బాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అనే విషయం మనం మర్చిపోతాం. ప్రేమ కథలు మనం చూస్తూనే ఉంటాం. కానీ తెరకెక్కించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కూడా బుచ్చి బాబు సానా తనదైన స్టైల్ లో రూపొందించారు.
సినిమాటోగ్రాఫర్ అయిన షమ్‌దత్ సైనూదీన్ అంతకుముందు ఆవకాయ బిర్యాని, ప్రస్థానం, సాహసం, దేవదాసు సినిమాలతో పాటు ఇంకా ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి కూడా షమ్‌దత్ సైనూదీన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. లొకేషన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు.
ప్లస్ పాయింట్స్ :
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
- విజయ్ సేతుపతి
- హీరో హీరోయిన్స్ పర్ఫామెన్స్
- దర్శకత్వం
మైనస్ పాయింట్స్ :
- కొంచెం తెలిసిపోయే స్టోరీ
- అక్కడక్కడా ల్యా గ్
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ :
అన్ని ప్రేమ కథలు ఒకే లాగా ఉండవు. ఇప్పటికే మెజారిటీ శాతం ప్రేక్షకుల్లో సినిమాకి సంబంధించి చాలా హైప్ క్రియేట్ అయ్యింది. అదే హైప్ కంటిన్యూ చేస్తూ చూసినా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళినా కూడా ఉప్పెన ప్రేక్షకులని డిసప్పాయింట్ చేయదు.
End of Article