Ads
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఉప్పెన ట్రైలర్ ఫిబ్రవరి 4వ తేదీన 04:05 కి విడుదల అవ్వబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల అవ్వబోతోంది.
Video Advertisement
ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది.
కొంతకాలం క్రితం దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా “నీ కన్ను నీలి సముద్రం” పాట అయితే యూట్యూబ్ లో 167 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. పాటలతో, టీజర్ తో ప్రేక్షకులకి ఆసక్తి ఇంకా పెంచిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.
End of Article