Ads
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కొంత కాలం క్రితం తుదిశ్వాస విడిచారు. భార్య దూరం అవడం తో ఉత్తేజ్ పరిస్థితి మరింత బాధాకరంగా ఉంది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన నటులు.. ఆయన విలపిస్తుంటే చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Video Advertisement
నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి (48) గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలోనే ఆమె చికిత్స తీసుకున్నారు. తాజాగా, ఆమె పరిస్థితి విషమించడంతో రెండు నెలల క్రితం ఆమె కన్నుమూశారు.
ఇటీవల పద్మ గారి పుట్టినరోజు అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా ఉత్తేజ్ ఒక పోస్ట్ షేర్ చేసారు. అందులో ఉత్తేజ్ ఈ విధంగా రాసారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై..ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు..
చాలా నొప్పి పద్దు…. నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది….లవ్ యూ పద్దమ్మా.. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు….”
అలాగే పద్మ గారితో ఉన్న కొన్ని ఫొటోస్ ని కూడా ఉత్తేజ్ షేర్ చేశారు. వీటితో పాటు ఒక నోట్ కూడా ఉత్తేజ్ పోస్ట్ చేశారు. అందులో ఉత్తేజ్, “తాను కష్టాలు పడుతున్న సమయంలో పద్మ గారు తనకి తోడు ఉన్నారని, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు అని, తన కలలన్ని సాకారం అవుతున్న సమయంలో వదిలేసి వెళ్ళిపోయారు” అని రాశారు. “నాది ఒక ప్రపంచం, తనది ఒక ప్రపంచం అంటూ ఏదీ లేదు అని, ఇద్దరు ఒకటే” అని సారాంశం వచ్చేలా ఉత్తేజ్ రాసారు.
End of Article