‘పెళ్లి’ సినిమా తో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరో వడ్డె నవీన్.మనసిచ్చి చూడు’, ‘చాలా బాగుంది’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, మా బాలాజీ తదితర చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యాడు. కానీ సడన్ గా కెరీర్ ఆగిపోయింది. సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘అటాక్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు కానీ అంతగా హిట్ కొట్టలేకపోయాడు. ఇక సినిమాలకు సెలవిచ్చి సొంత వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు నవీన్.

Video Advertisement

అయితే ఇంత సడన్ గా అతని గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? తాజాగా అతను ఓ ఫంక్షన్ ఫోటోల వల్ల వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో మళ్ళీ చర్చ మొదలైంది ఈ ఫోటోలకు వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే వడ్డే నవీన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుక ఇటీవలే మాదాపూర్ ఆవాస హోటల్‌లో జరిగింది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీఐఐసి చైర్మన్ రోజా హాజరయ్యారు. అలాగే శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు కూడా పాలు పంచుకున్నారు. ఆ వేడుకకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.