పెళ్లి పీటలెక్కనున్న “వదినమ్మ” నటి ప్రియాంక…వరుడు కూడా సీరియల్ నటుడే.! ఎవరంటే?

పెళ్లి పీటలెక్కనున్న “వదినమ్మ” నటి ప్రియాంక…వరుడు కూడా సీరియల్ నటుడే.! ఎవరంటే?

by Megha Varna

Ads

బుల్లి తెరపై బాగా పాపులర్ అయిన సీరియల్స్ స్వాతి చినుకు,వదినమ్మ తో ప్రేక్షకులకు సుపరిచితులు ప్రియాంక నాయుడు.ప్రత్యేకంగా వదినమ్మ సీరియల్ లో ప్రియాంక పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో మరింత పాపులర్ అయ్యారు ప్రియాంక నాయుడు.అయితే లాక్ డౌన్ కారణంగా అందరిలాగే ప్రియాంక నాయుడు కూడా ఇంటికే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ లో ప్రేక్షకులతో ముచ్చటిస్తూ తాను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..ఆ వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

ఇన్ స్టాగ్రామ్ లో ప్రేక్షకులతో ముచ్చటిస్తుండగా మీకు కాబోయే భర్త ను చూపించండి అని కొంతమంది నెటిజన్లు ప్రియాంక నాయుడు ను అడిగారు.దీంతో వెంటనే తాను పెళ్లి చేసుకోబుతున్న వ్యక్తి ఫోటో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు ప్రియాంక నాయుడు.ఇంతకీ ప్రియాంక నాయుడు పెళ్లి చేసుకోబోతుంది మధు అనే బుల్లితెర నటుడిని. అభిషేకం సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు మధు.

 

మధు, ప్రియాంక నాయుడు కు దగ్గర బంధువు కావడం వలన వీరి పెళ్ళికి పెద్దలు కూడా ఎటువంటి అడ్డంకి తెలపలేదు.అయితే మధు ,ప్రియాంక నాయుడు త్వరలో ఏడూ అడుగులు నడవబోతున్నారు అని తెలుస్తుంది.మధు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి,నాకు ఎప్పుడూ సపోర్టివ్ గా ఉంటారు,అందరిలా మోసం చేసే వ్యక్తి కాదు అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రశంసలతో ముంచెత్తారు ప్రియాంక నాయుడు.


End of Article

You may also like