Ads
సామెతలు ఊరికే పుట్టవు.. ఎనకెటికి ఎవడో తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడని వెతకడానికి అని చెప్పాడట.. ఈ లాక్ డౌన్ సంధర్బంలో రోడ్లపైకి వస్తున్న కొందరు చెప్పే రీజన్స్ చూస్తుంటే ఆ సామెతలన్ని నిజమే అనిపిస్తుంది.వాటికి కొత్త వెర్షన్స్ రాయాలని కూడా అనిపిస్తుంది. కదిలేకాళ్లు వాగే నోళ్లు ఊరికే ఉండవని పెద్దలంటుంటారు.అట్లా ఈ లాక్ డౌన్ దెబ్బకి ఒక్కసారిగా ఇంట్లోనే ఉండి బయటికి కాళ్లు కదపకుండా ఉండడమంటే ఊపిరాడక అల్లాడిపోతున్నట్టుగా చాలామంది ఫీలవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో బయటకి వచ్చిన ఈ యువతి చెప్పిన కారణం వింటే నవ్వు ఆపుకోలేరు. వడియాలు అని కారణం చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Video Advertisement
watch video:
శ్రీనగర్ కాలనీ నుండి చింతల్ బస్తీకి గోధుమ పిండి కోసం వచ్చాడట ఒక మహానుభావుడు, మీ ఏరియాలో గోధుమ పిండి లేదా అంటే ఆశీర్వాద్ పిండి లేదూ అని సమాధానం.. చేతికి ప్ల కార్డు ఇచ్చి ఎండలో నిల్చొబెట్టి సన్మానం చేశారు పోలీసులు . మరొకడు పాలకూర కోసం బయటికి వచ్చాడట.. ట్విస్టు ఏంటంటే వాళ్ల పిల్లలు పాలకూరే తింటామన్నారట.. దీనికి రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ హైలైట్ అసలు పిల్లలు పాలడుగుతారు కాని, పాలకూర అడుగుతారా ఆ ప్రశ్నలో కూడా అర్దముంది కదండీ..
మరో మహాతల్లి మందు దొరక్క ఇబ్బంది పడుతున్నామని అంటే, ఇంకొకడు రోడ్ల మీద జనం ఉన్నారో లేదో చెక్ చేయడానికి వచ్చాడట,ఒకరు ఎటిఎం కోసం వచ్చామని పోలీసులకి, కూలర్ పాడైంది వైర్ కోసం వెళ్తున్నా అని పోలీసులకి రెండు వేరు వేరు కారణాలు చెప్పి దెబ్బకి బుక్కయిపోయాడు. ఇంక టిక్ టాక్ పిచ్చోళ్ల సంగతి చెప్పక్కర్లేదు, టిక్ టాక్ చేయడానికి రోడ్లెక్కి దెబ్బలు కూడా తిన్నారు.
ఇన్నిన్ని సిల్లీ రీజన్స్ చెప్తుంటే అసలు అత్యవసర పనులపై బయటికి వచ్చేవారిని గుర్తించడం ఎలా? ముందు నుండి ప్రభుత్వం చెప్తూనే ఉంది అత్యవసరల పనులు, నిత్యావసర సరుకులకి బయటికి రావొచ్చు అది కూడా ఇంటికొకరు, ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు గంటలవరకు అని.. కాని మనోళ్లు జేబులో ఒక ట్యాబ్లెట్ పెట్టుకుని ఊరంతా బలాదూర్ తిరగడానికి బయల్దేరతారు . ఎక్కడ పోలీసులు ఆపినా మెడికల్ షాప్ కి ఇది ఒక రీజన్ చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇప్పుడు కొత్తగా బ్యాంక్ పనులున్నాయని మరొక కొత్త సాకు రెడీగా పెట్టుకున్నారు. ఇలాంటి పిచ్చి రీజన్స్ చెప్పేవారిని లాగి పెట్టి కొట్టాలని మీకే అనిపిస్తుందా లేదా ? ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒకవైపు ఎండలు మండిపోతున్నయి, మరోవైపు కరోనా కనికరం లేకుండా అందరిని టచ్ చేస్తుంది.. ఆ ఎండల్లో డ్యూటీలు చేస్తూ ,కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు నానా పాట్లు పడుతుంటే , మనం ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలతో బయటికి వస్తే ఎంత మందినని వదిలేస్తారు .. కేవలం మన ఒక్కరికోసం కాదు కదా, నువ్ నీ ఆనందం చూస్కుంటే ఇబ్బంది పడేది నీ కుటుంబమే జస్ట్ ఈ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి చాలూ.
watch video:
also watch:
End of Article