సినిమా ఓకే చేయడానికి “వైష్ణవి చైతన్య” ఈ కండిషన్స్ పెడుతున్నారా..? అవి ఏంటంటే..?

సినిమా ఓకే చేయడానికి “వైష్ణవి చైతన్య” ఈ కండిషన్స్ పెడుతున్నారా..? అవి ఏంటంటే..?

by kavitha

Ads

చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తూ, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా  నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ విజయం సాధించడంతో బేబీ సినిమాలో నటించిన నటినటులందరికి మంచి గుర్తింపు వచ్చింది.

Video Advertisement

అయితే అందరికన్నా ఎక్కువ గుర్తింపు లభించింది మాత్రం హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య అని చెప్పవచ్చు. ఆమె అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. బేబీ హిట్ తో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఆమె కండిషన్ కు అంగీకరిస్తేనే సినిమాలను ఒకే చేస్తోందట. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వైష్ణవి చైతన్య పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగుతోంది. అయితే ఆమె ఈ మూవీకి ముందు ఆమె యూట్యూబర్‌  గా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వాటి ద్వారానే  వైష్ణవి చైతన్య సినిమాలలో అవకాశాలను పొందారు. అలా ఆమె కెరిర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్యకు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ సినిమాలో హీరోయిన్ గా అవక్షం వచ్చింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ మూవీ హిట్ తో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన తొలి సినిమా విజయం సాధించడంతో తదుపరి చిత్రాలకు కండిషన్లు పెడుతున్నట్టు సమాచారం. రెండవ చిత్రానికి గాను వైష్ణవి చైతన్య దర్శక నిర్మాతలకు పలు షరతులు పెట్టారని, వాటికి అంగీకరిస్తేనే మూవీకి సైన్ చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.సినిమాలకు తాను సైన్ చేయాలంటే అడ్వాన్స్ ముందుగానే చెల్లించాలని, ఒక్కో చిత్రానికి రూ. 2 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే వారి చిత్రాలలో నటిస్తానని సూటిగా చెబుతున్నారని తెలుస్తోంది. అయితే వైష్ణవి చైతన్య రెండవ ఇలాంటి షరతులు పెట్టడంతో ఆమె పై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read: అసలు ఏంటి ఈ సినిమా..? నాగార్జున రీమేక్ చేసే అంతగా ఏం ఉంది ఇందులో..?

 


End of Article

You may also like