Ads
చిన్న బడ్జెట్ తో వచ్చి పెద్ద సక్సెస్ ని అందుకున్న సినిమా బేబీ. ఆ చిత్ర విజయాన్ని చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఆనంద్ దేవరకొండ, వీరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించారు. అయితే ఈ సినిమాలో హీరోల కన్నా హీరోయిన్ పాత్ర పోషించిన వైష్ణవి చైతన్యకు ఎక్కువ ఫేమ్ వచ్చింది.
Video Advertisement
ఆమె నటనకు సినీ విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు మరొకసారి ఆనంద్ దేవరకొండ తోనే హీరోయిన్గా నటించే సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ మరొక బంపర్ ఆఫర్ కొట్టేసింది బేబీ హీరోయిన్. వివరాల్లోకి వెళ్తే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు,శిరీష్ ఎప్పుడూ ముందుంటారు అనే విషయం తెలిసిందే.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. బలగం సినిమా ఈ సంస్థలో నుంచి వచ్చినదే. ఇప్పుడు ఈ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో ఆశిష్ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది అందులో హీరోయిన్గా వైష్ణవి చైతన్యను ఫైనల్ చేశారు. తాజాగా ఆమె లుక్ ని సైతం మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ లో ఆమె చాలా క్యూట్గా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హర్షిత, నాగమల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుంటే నేషనల్ అవార్డు విన్నర్ పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిజంగా వైష్ణవి ఎంతోమంది హీరోయిన్ అవ్వాలి అనుకున్న తెలుగు అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ గా నిలబడింది. గ్రేట్ కదా.
End of Article