పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తరువాత ఆయన “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాక.. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టింది.

vakeel-saab-trailr

ఇక ఈ చిత్రంలో అంజలి ఫోటోని మార్ఫ్ చేసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అనే సన్నివేశం ఉంటుంది. ఆ తర్వాతే సినిమాలో అంజలి ఉద్యోగం కూడా పోతుంది. అయితే ఈ ఫోన్ నెంబర్ ఇప్పుడు చిత్రబృందంకి పెద్ద సమస్యగా మారింది.

టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం ఆ ఫోన్ నెంబర్ కలిగిన అసలు ఓనర్ “సుధాకర్” గారు తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. సినిమా చూసిన కొందరు అమ్మాయి కావాలి అని ఆ నెంబర్ కి ఫోన్ చేసి వేధిస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. సుధాకర్ లాయర్ గారు ఈ చిత్ర నిర్మాతలకు నోటీసు పంపించారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తారో చూడాలి.