జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరికొత్త లుక్‌ ఆకట్టుకొంటుంది. 2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌ రాజకీయ రంగప్రవేశంతో వెండితెరకు దూరమయ్యారు. ఇంత వరకూ సినిమాల్లో నటించలేదు,దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ వెండితెరపై కనిపించబోతున్న చిత్రం ఇది. MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి  ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. వకీల్ సాబ్‌గా ఒక చెయిర్‌లో కూర్చొని కాలుపై మరో కాలు వేసుకొని కేసు స్డడీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది..

Video Advertisement

మీ పేరు తో వకీల్ సాబ్‌ టైటిల్ లా మార్చుకోండి ఇలా.క్లిక్ చేయండి (Vakeel Saab Movie Font)

అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి తెరమీద కనిపించనున్నాడు. ‘పింక్‌’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో షూటింగ్ లో పాల్గొన్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. గడ్డం లుక్ తో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫాన్స్ అందరు ఫుల్ హై లో ఉన్నారు ఆ ఫస్ట్ లుక్ చూసే. ఇక సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ అలాంటిది.

>>>>>Click Here To Generate Your Name In Vakeel Saab Movie Font<<<<<

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. రెండేళ్ళ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ రంగేసుకోలేదు. ఇప్పుడు పింక్ సినిమా రీమేక్‌తో వచ్చేసాడు. .తాజాగా ఈయన షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని చాలా రోజులుగా అంటున్నారు. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసిన బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ తెలుగులో దిల్ రాజుతో కలిసి రీమేక్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాకు మొదట్లో లాయర్ సాబ్ అని టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ టైటిల్ ను ఫైనల్ చేసారు. పవన్ రావడంతో అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు. పింక్ రీమేక్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతం అంతా హడావిడిగా మారిపోయింది. పవర్ స్టార్‌ను చూసి సంబరాలు చేసుకున్నారు అభిమానులు.

రెండేళ్ళ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ రంగేసుకోలేదు. ఇప్పుడు పింక్ సినిమా రీమేక్‌తో వచ్చేసాడు. ఫస్ట్ లుక్ కె ఇంత ట్రెండ్ అవుతుంది అంటే…ట్రైలర్ కి సినిమాకి ఇంకెంత ట్రెండ్ అవుతుంది. అందుకే ఆయన్ని ట్రెండ్ సెట్టర్ అనేది.