ఇదెక్కడి మోసం “కేశవ” మావా..? “పుష్ప”లో ఈ సీన్ గమనించారా..?

ఇదెక్కడి మోసం “కేశవ” మావా..? “పుష్ప”లో ఈ సీన్ గమనించారా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

van logic in pushpa goes viral

థియేటర్లో చూసినప్పుడు సినిమాకి సంబంధించిన చాలా పొరపాట్లు మనకి అంత పెద్దగా కనిపించవు. అదే సినిమాని టీవీలో చూసినప్పుడు కానీ, లేదా థియేటర్లలోనే ఒకటి గంటలకు సార్లు చూసినప్పుడు కానీ మనం గమనిస్తూ ఉంటాం. అలా పుష్పకి సంబంధించిన ఒక పొరపాటు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే, హీరో ఒక సందర్భంలో వ్యాన్ కొనుక్కోవాలి అని అనుకుంటాడు.

van mistake in pushpa movie

అందుకోసం హీరో ఫ్రెండ్ అయిన కేశవకి ఈ విషయం చెప్పి వ్యాన్ కొనుక్కురమ్మని చెప్తాడు. కేశవ హీరో చెప్పినట్టే వ్యాన్ కొనుక్కొని వస్తాడు. కేశవ కొనుక్కొచ్చే వ్యాన్ మారుతి సుజుకి ఓమ్ని 5 సీటర్. దాని ధర 1. 74 లక్షల రూపాయలు. పుష్ప కేశవకి 5 లక్షలు ఇచ్చి వ్యాన్ కొనుక్కురమ్మని చెప్పాడు. కేశవ 5 లక్షలు పెట్టి వ్యాన్ కొనుక్కొచ్చినట్లు మనకు చూపిస్తారు. దాంతో “2 లక్షల వ్యాన్ కి 5 లక్షలు తీసుకున్నావా కేశవ?” అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

reasons behind pushpa negative talk

ఇంక సినిమా విషయానికొస్తే, పుష్ప రెండవ భాగం కథా విషయంలో చాలా మార్పులు చేసినట్టు సమాచారం. సినిమా కేవలం తెలుగులో కాకుండా హిందీలో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. అందుకే సౌత్ కాకుండా నార్త్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని సెకండ్ పార్ట్ కథ రాసుకుంటున్నారు. అంతకుముందు రాసుకున్న కథలో ఒక్కరే విలన్ ఉన్నారు. కానీ ఇప్పుడు మరో విలన్ కూడా ఉండబోతున్నారు. ఆ పాత్ర కోసం ఒక పెద్ద పేరున్న బాలీవుడ్ నటుడిని అనుకుంటున్నారట. సినిమా బృందం ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది.


End of Article

You may also like