Ads
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన దేవి చిత్రంలో నటించిన వనితా విజయకుమార్ 40 యేళ్ళ వయసులో మరోసారి వివాహం చేసుకున్నారు. వనితా విజయకుమార్ మొదటగా ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. అయితే ఆకాష్ వనితలకు ఒక కుమార్తె ఉంది.అయితే కొన్ని విబేధాల కారణంగా వనితా విజయకుమార్ ఆకాష్ తో విడిపోయారు. తర్వాత జయ రాజన్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడారు.అయితే కొన్ని అభిప్రాయభేదాలు వలన జయ రాజన్ తో విడిపోయారు కాగా వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు.
Video Advertisement
అయితే ఇప్పుడు మళ్ళీ వనితా విజయకుమార్ పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారు. వనితా విజయకుమార్ మళ్ళీ పెళ్లిచేసుకోవడం పై సినీ ప్రమంచమంతటా చర్చనీయాంశం అయింది.జూన్27 న క్రైస్తవ మత ఆచారం ప్రకారం సాయంత్రం 4 గంటలకు చెన్నైలో వీరి వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. వేడుకలో వనిత ముందు భర్త పిల్లలు జోవికా, జయనిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే పీటర్ పాల్‌ను వనితా విజయకుమార్ వివాహం చేసుకున్న మరుసటి రోజు పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ చెన్నైలోని వడపాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీటర్ తో ఆమె ఏడు సంవత్సరాలుగా విడిపోయినప్పటికీ చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని ఆరోపించారు. ఎలిజబెత్ మరియు పాల్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. “నా భర్త మాతో కలిసి జీవించాలని నేను కోరుకుంటున్నాను. నా పిల్లలకు వారి తండ్రి అవసరం ఉంది. వనిత మా అపార్థాన్ని ఉపయోగించుకుంది మరియు దీన్ని చేసింది. నా పిల్లలు తమ తండ్రిని కోరుకుంటారు.నా జీవితాన్ని నేను కోరుకుంటున్నాను, ”అని ఆమె చెప్పింది.
ఇప్పుడు, వనిత కుమార్తె జోవికా…తన తల్లి వనిత వివాహం గురించి హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేసి పీటర్ పాల్ ను వారి కుటుంబానికి స్వాగతించింది. “నేను మీరు చేసిన పనికి సంతోషంగా ఉన్నాను మరియు మీ గురించి గర్వపడుతున్నాను !! పప్పా ను మా చిన్న కుటుంబంలోకి సంతోషంగా స్వాగతించాను.
ఎవరైనా నన్ను “మీ కుటుంబం గురించి చెప్పు” అని అడిగినప్పుడల్లా మీ పేర్లే నాకు గుర్తొస్తాయి. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఇది మన జీవితం. ఆనందంగా గడుపుదాము” అని జోవికా విజయకుమార్ పోస్ట్ చేసింది.
End of Article