ఇదేం పెళ్లిరా బాబు.? పెళ్లి తమ్ముడితో…కాపురం అన్నయ్యతో.? ట్విస్ట్ ఏంటంటే.?

ఇదేం పెళ్లిరా బాబు.? పెళ్లి తమ్ముడితో…కాపురం అన్నయ్యతో.? ట్విస్ట్ ఏంటంటే.?

by Mohana Priya

Ads

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టంలాగా భావిస్తారు. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. అంటే పెళ్లికి అంత ప్రత్యేక స్థానం ఇస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు ఎంతో విడ్డూరంగా జరుగుతున్నాయి. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు పెళ్లి చేసుకోవడం, అతి ముసలి వయసు ఉన్న అతను చాలా చిన్న పిల్లను చేసుకోవడం, తనకు తానే తాళి కట్టుకుని, స్వీయ ప్రేమ అంటూ స్వీయ పెళ్లి చేసుకుంటున్న యువతి విడ్డూరం. ఇలాంటి ఎన్నో వాండర్స్ జరుగుతున్నాయి.

Video Advertisement

కాగా ఇటీవల పెరుగుతున్న సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినయోగదారుల ద్వారా, ఇలాంటి సంఘటనలు ఇట్టే తెలిసిపోతున్నాయి. ఈ తరుణంలోనే తాజాగా ఒక వింత పెళ్లి వెలుగులోకి వచ్చింది. బహుశా ఇలాంటి పెళ్లి మీరిప్పుడూ చూసి కానీ, విని కానీ ఉండరు అనుకోండి.

అన్నయ్య, తమ్ముడు ఓకే అమ్మాయిని ప్రేమిస్తే, ఇద్దరిలో ఒకరికి ఇచ్చి చేయడం చూశాం. కానీ ఇక్కడ అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని తమ్ముడు పెళ్లి చేసుకుంటే, అన్నయ్య కాపురం చెయ్యడానికి తీసుకెళతాడు. అవును ఇది నిజమే.ఈ సంఘటన పశ్చిమ ఆఫ్రికాలో చోటు చేసుకుంది.

అయితే 26 ఏళ్ల మొహ్హమ్ముద్ బుయా టురే అనే ఫుట్ బాల్ ప్లేయర్, తాజాగా చైనా ఫుట్ బాల్ లీగ్ నుండి, స్వీడన్ కు చెందిన మాల్మో ఎఫ్ సీ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు. ఈ క్రమంలో ఒక యువతిపై మనసు పారేసుకున్న టురే, తనని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. దీనికి ముహూర్తం కుదుర్చుకున్న, తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే. ఫుట్ బాల్ క్లబ్ నిర్వాహకులు సడెన్ గా ఒక తీర్పును వెలువరించారు.

ఇది తొలి ఫుట్ బాల్ మ్యాచ్ కావడంతో, ప్రాక్టీస్ సెషన్ లో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. చేసేది లేక, మొహ్హమ్ముద్ బుయా టురే అక్కడి నుండి ప్రాక్టీసు వెళ్ళాడు. ఇలాంటి హతాత్పరిణామాలు జరిగినప్పుడు ఎవరైనా కుదిరితే పెళ్లి ముందు రోజే చేసుకుంటారు, లేదా పోస్ట్ పోన్ చేస్తారు. కానీ మొహ్హమ్ముద్ ఎలా కాదు. తన స్థానంలో అతని సోదరుడిని కూర్చోబెట్టి పెళ్లి తంతు మొత్తం పూర్తి చెయ్యమని చెప్పాడు. దీంతో, మొహ్హమ్ముద్ సోదరుడు, స్వయంగా పెళ్లి కొడుకులా జీలకర్ర బెల్లం వంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాడు.

ఇది తెలిసిన నెటిజన్లు, తీవ్రంగా విమర్శించారు. దీనికి మొహమ్మద్ స్పందిస్తూ, అతను అంతక ముందు రోజే తన ప్రియురాలితో పెళ్లి ఫోటోలు తీసుకున్నాడని…ఫుట్ బాల్ మ్యాచ్ ల వల్ల తాన్ భార్యను కలవడం కుదరడం లేదని అన్నాడు. అదే కాక అతని భార్యని కూడా స్వీడన్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు. దీంతో నెటిజన్లు ఇదేం విడ్డూరం రా బాబు ఏంటో కంగుతింటున్నారు.


End of Article

You may also like