Ads
జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన వర్ష షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. జబర్దస్త్ నుండి తను వెళ్ళిపోతున్నట్టు వర్ష ప్రకటించారు. ఇందుకు కారణం ఏంటి అనే విషయం కూడా చెప్పారు వర్ష. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో వర్ష ని రోజా “ఏంటి వర్షా” జబర్దస్త్ వదిలి వెళ్లిపోతున్నారట కదా? కారణం ఏంటి?” అని అడిగారు. అందుకు కన్నీటిపర్యంతమైన వర్ష కారణం చెప్పారు.
Video Advertisement
మనకి ప్రోమోలో చూపించిన దాని ప్రకారం వర్ష ట్రోలింగ్ అనే విషయాన్ని అడ్రస్ చేశారు. ఇందులో వర్ష మాట్లాడుతూ, “మనమంటే ఇలాంటివి తట్టుకోగలము. కానీ మన కుటుంబ సభ్యులు అలా ఉండరు కదా? మా తమ్ముడు ఫోన్ తీసుకు వచ్చి నా మొహం మీద పెట్టి, “అక్కా ఏంటి?” అని అడిగాడు. నేను అది ఫేస్ చేయలేకపోయాను
మీరు మామూలుగా మీ అక్కని కానీ, చెల్లిని కానీ ఎవరైనా ఒక్కమాట అంటేనే, “మా వాళ్ళని అంటావా?” అని కోపగించుకుంటారు. కానీ నన్ను ఏదైనా అన్నప్పుడు నేను ఆడపిల్లని కదా మీకు ఇంత కూడా జాలి అనిపించలేదా?” అని బాధపడ్డారు వర్ష. వర్ష మాట్లాడుతున్నప్పుడు తనతో పాటు పక్కన రష్మీ, బుల్లెట్ భాస్కర్ కూడా ఉన్నారు.
watch video :
https://www.instagram.com/p/CSRL5xKJ581/?utm_medium=copy_link
End of Article