గత కొద్ది సంవత్సరాలుగా టెలివిజన్ పై తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు వర్షిణి సౌందరాజన్. ఈటీవీ తో పాటు, మాటీవీ అలాగే ఇంకా వేరే ఛానల్స్ లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తారు వర్షిణి. అయితే వర్షిణి యాంకరింగ్ లోకి రాకముందు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన చందమామ కథలు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు వర్షిణి.

Varshini sounderajan joins team Shaakuntalam

అంతే కాకుండా కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించారు. అయితే వర్షిణి ఇప్పుడు మళ్ళీ సినిమాలో కనిపించబోతున్నారు. అది కూడా పాన్ ఇండియన్ సినిమా. సమంత అక్కినేని హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నారు వర్షిణి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వర్షిణి నెటిజన్లతో పంచుకున్నారు.

అంతే కాకుండా సుమంత్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా నటిస్తున్నారట వర్షిణి. ఇవి మాత్రమే కాకుండా స్టార్ మా లో కామెడీ కింగ్స్ ప్రోగ్రాంకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.