“90స్” లో నటించిన ఈ అమ్మాయి… ఆ “నాని” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందా..?

“90స్” లో నటించిన ఈ అమ్మాయి… ఆ “నాని” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందా..?

by kavitha

Ads

ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్ లకు అభిమానులు భారీగా పెరిగారు. వాటికి ఆడియెన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అటు థియేటర్స్ లో సినిమాలు ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, ఇంట్లో ఓటీటీలో  సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను వీక్షిస్తున్నారు.

Video Advertisement

ఈ క్రమంలో ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ లు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన 90 స్  సిరీస్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ లో నటించిన వారందరు పాపులర్ అయ్యారు. అయితే శివాజీ కూతురిగా నటించిన వసంతిక హీరో నాని మూవీలో బాలనటిగా నటించినట్టు తెలుస్తోంది. ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆదిత్య హాసన్ తెరకెక్కించిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అప్పటి తరం పిల్లలు, తల్లి తండ్రులు, 90లలోని పరిస్థితులను, ఎమోషన్స్, ఆకట్టుకునే డైలాగ్స్ తో పాటు మ్యూజిక్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ 120 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఐఎండిబిలో 9.6 రేటింగ్ పొందింది. శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్ రాయ్ నటించారు.
శివాజీ కూతురు దివ్య పాత్రలో వసంతిక మచ్చ నటించింది. ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సిరీస్ కన్నా ముందు ఆమె పలు చిత్రాలలో బాలనటిగా నటించి, మెప్పించింది. 90స్ సిరీస్ తో పాపులర్ అవడంతో వసంతిక నటించిన మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాని హీరోగా నటించిన ఓ సినిమాలో వసంతిక బాలనటిగా కనిపించింది.
నాని, మెహ్రీన్ పిర్జాద జంటగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ మూవీ 2016 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వసంతిక బాలనటిగా కనిపించింది. నాని, వసంతిక ఉన్న సీన్ మరియు 90స్ లోని సీన్ కలిపి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ‘ఓరిని ఈ పాప అప్పుడే పెద్దది అయిపోయిందా’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C2C89LbpMJB/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read : సినిమా కోసం ఢీ గ్లామర్ రోల్ లో నటించిన 15 మంది హీరోయిన్లు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!


End of Article

You may also like