కార్ లేదా బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి టైం.! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

కార్ లేదా బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి టైం.! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

by Megha Varna

Ads

కరోనా దెబ్బ ఇంతకుముందులా వెహికల్స్ ఎక్కువగా రోడ్డు మీద తిరగట్లేదు. ఒకవేళ తిరుగుతున్న వాటి చార్జీలు వాసిపోతున్నాయి. ఒక పక్క కరోనా మరో పక్కన ఈ చార్జీ ధరలను చూస్తున్న ప్రజలకు బయటకు రావాలంటే భయం పట్టుకుంటుంది. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ వినిపిస్తుంది.

Video Advertisement

అదేంటో ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వాహనాలు కొనేటప్పుడు మనకు అవసరం లేకున్న మనకు బలవంతంగా సుదీర్ఘ ఇన్సూరెన్స్ పాలసీలను వాహ‌న‌డీల‌ర్లు అంటగడుతుంటారు.ఈ విధానంలో 1 ఏడాదిపాటు ఓన్‌డ్యామేజ్ ఇన్సూరెన్స్‌+థ‌ర్డ్ పార్టీ క‌వ‌రేజీ ఉంటాయి.ఈ విధానాన్ని సెప్టెంబర్ 2018 నుండి అమలు చేస్తున్నారు.ఈ విధానంలో అతి పెద్ద డ్రా బ్యాక్ ఓన్‌డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ మళ్లీ తీసుకోవడానికి కుదరదు.అందువల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇది గమనించిన ఐఆర్‌డీఏఐ. ప్రజల సమస్యలను, కరోనా టైంలో వాహనాల ధరలు తగ్గించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది.దీనితో ఇక పై వాహనాలను కొనుగోలు చేసే వారు సుదీర్ఘ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌తో పాటు థ‌ర్డ్ పార్టీ క‌వ‌రేజీని ఓ ఏడాది పాటు తీసుకునే విధంగా అది మళ్లీ కావాలంటే మరో ఇయర్ దీన్ని పొడిగించుకునే విధంగా ఓ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది.ఈ విధానం ఆగస్టు 1వ తేదీ నుండి అమలు లోకి రానున్నది.

దీంతో సుదీర్ఘ పాలసీలకు చెల్లిస్తున్న డబ్బులు మొత్తం వాహన ఖరీదు లో తగ్గనున్నాయి.తాజాగా ఐఆర్‌డీఏఐ తీసుకున్న నిర్ణయం వాహనాల కొనుగోలును ఏ మాత్రం పెంచుతుందో వేచి చూడాలి.


End of Article

You may also like