Ads
రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు ప్రారంభం అయ్యినట్టే వుంది. అస్సలు టీడీపీ ఎలాంటి వ్యూహాలని వేస్తోంది..? కొడాలి నానికి చెక్ పెట్టేస్తోందా..? మరి గుడివాడలో ఎవరు గెలిచేది..? ఆయన బలం ఎంత…? కృష్ణాజిల్లా గుడివాడ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
Video Advertisement
ఏపీ రాజకీయాల్లో కీలకమైన నియోజకవర్గం ఇది. కారణం ఎవరో తెలిసిందే. కొడాలి నాని. మొదట టీడీపీ లో వున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తరవాత ఆయన వైసీపీ లో చేరి టీడీపీ కి చాలా ఇబ్బందిగా అయ్యారు.
నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులపై ఆయన తీరు సరిగా లేకపోవడంతో కొడాలి నాని కి రాబోయే ఎలక్షన్స్ లో చెక్ పెట్టేసేలానే కనపడుతోంది. దేవినేని నెహ్రు కొడుకు అవినాష్ ని ఎన్నికల్లో నిలబెట్టిన ఫలితమేమి లేదు. ఇది ఇలా ఉంటే టీడీపీ అధిష్ఠానం పలువురి పేర్ల కోసం చూస్తుంటే ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగండ్ల రాము పేరు బయటకి వచ్చింది. గుడివాడ కి చెందిన ఈయన అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై. ఈయన ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేసేలా కనపడుతున్నారు. ఓ మార్పు ఈయన తెచ్చేలాగా వున్నారు.
అంగబలం, అర్ధబలం రెండూ వున్నాయి. పైగా ఎంతో సౌమ్యుడు. హడావుడి ప్రచారాలకు కూడా ఈయన దూరంగా వుంటారు. ఒక మెరుపులా ఈయన వచ్చేలా వున్నారు. అంతే కాదు ఇప్పటికే పలు సార్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా కలిసారుట.
పైగా చంద్రబాబు కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. రాము కుటుంబ సభ్యులు గుడివాడలో కొన్ని పనులని కూడా నెమ్మదిగా పూర్తి చేసేస్తున్నారు. క్రిస్మస్ నుంచి గుడివాడ జనాలకు ఈయన దగ్గరయ్యి మొత్తం యాక్షన్ ప్లాన్ రాము అమలు చేసేలా వున్నారు.
ఇప్పటికే రాము తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం అందించారట. అలానే బడుగు బలహీన వర్గాల్లో రాము కుటుంబానికి పట్టు ఉండడం కూడా ప్లస్ అవుతుంది. ఇలా ఎన్నో మంచి గుణాలు ఆయనలో వున్నాయి. దీనితో నానికి సరైన పోటీ రాము అని తెలుస్తోంది. దీని మీద ఇప్పటికే గుడివాడలో చర్చ కూడా నడుస్తోంది. పైగా రాము ఇప్పటి దాకా ఎవరినీ ఏమి అనలేదు. ఆయనని కూడా ఇప్పటి వరకు ఏమి అనలేదు. పైగా గుడివాడ ప్రజలు ఇప్పటికే నాని తో విసిగిపోయారు. దీనితో వెనిగండ్ల రాము ముందుకు రావాలనే చూస్తున్నారు గుడివాడ ప్రజలు.
End of Article