కాలేయ సంబంధిత జబ్బుతో బాధపడుతున్న ఒక తండ్రికి అతని కూతురు తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి  తండ్రి రుణాన్ని తీర్చుకుంది. తనను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచి,పెద్ద చేసిన తండ్రికి తన కాలేయ భాగాన్ని ఇచ్చి బ్రతికించుకుంది.

Video Advertisement

ఇలాంటి కుమార్తెలను చూసే ‘కంటే కూతుర్నే కనాలిరా’ లాంటి పాటలను రాసి ఉంటారు. జన్మనిచ్చిన నాన్నకు పునర్జన్మ ఇచ్చిన కుమార్తెను చూసి బంధువులు, చుట్టూపక్కల వారు ఆమెను అభినందిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
దర్శి గ్రామంలో పిఆర్ డిపార్ట్మెంట్ లో సూరె వెంకటరామిరెడ్డి సీనియర్ సహాయకుడిగా పని చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్య బారిన పడడంతో, వైద్య పరీక్షలు చేయగా కాలేయ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స చేయించుకోవడం కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో చేరారు. అక్కడ వైద్యులు టెస్ట్ చేసి, తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని వెంకటరామిరెడ్డి ఫ్యామిలీకి చెప్పారు. వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి ఆ వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వైద్యులు కాలేయ మార్పిడి గురించి చెప్పగానే తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికి ఆమె ముందుకొచ్చింది. దాని కోసం భర్త ప్రకాశ్ రెడ్డిని కూడా ఒప్పించింది.
హర్షిత కోరిక మేరకు, ప్రకాశ్ రెడ్డి కూడా కాలేయ మార్పిడికి ఒప్పుకున్నాడు. దాంతో హర్షిత వెంకటరామిరెడ్డికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చింది. కాలేయ మార్పిడిని డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో వెంకటరామిరెడ్డి ఆరోగ్యవంతుడిగా మారారు. తన తండ్రిని కాపాడడం కోసం కాలేయ దానం చేసిన హర్షిత పై ప్రశంసలు, అభినదనలు వెల్లువెత్తాయి.

Also Read: “నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?