Ads
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు ఊహించని విజయాన్ని, కొందరు ఊహించని పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్ గెలుపంటే కామారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డిదే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఓడించి సంచలన విజయం సాధించారు. తెలంగాణ లో జరిగిన అన్ని ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కామారెడ్డి రాజకీయం ఒకత్తుగా మారింది. ర దేశం దృష్టి అంతా కూడా కామారెడ్డి నియోజకవర్గమైన పడిందంటే అదంతా వెంకటరమణారెడ్డి గెలుపు వల్లే.
Video Advertisement
ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీకి దిగగానే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఎన్నికల చర్చంతా ఈ ఇద్దరు నేతల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే అంచనాలే వచ్చాయి. అయితే ఆ ఇద్దరినీ ఓడిస్తానంటూ వెంకటరమణారెడ్డి ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఆయన మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. తీరా చూస్తేఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్టుల మధ్య చివరికి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.
లెక్కింపు ప్రారంభంలో తొలుత రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. 12వ రౌండ్ వరకు ఆయనే లీడ్ కనబర్చారు. దీంతో రేవంత్ విజయం ఖాయమనే అనుకున్నారు. కానీ 13వ రౌండ్ నుంచి వెంకటరమణా రెడ్డి అనూహ్యంగా ముందుకు వచ్చారు. ఇక అప్పటి నుంచి అటు కేసీఆర్ ను ఇటు రేవంత్ ను వెనక్కి నెడుతూ చివరికి విజయం సాధించారు.
ఇప్పుడు ఎక్కడ చూసిన వెంకటరమణారెడ్డి గురించి చర్చ జరుగుతుంది. అసలైన మొనగాడు అంటే వెంకటరమణారెడ్డి కదా అంటూ మాట్లాడుకుంటున్నారు. కెసిఆర్ ని రేవంత్ రెడ్డిని సైతం ఓడించి నిలబడ్డాడు అంటే దమ్మున్న నాయకుడు వెంకటరమణారెడ్డి అని ఆయన అభిమానులు చెబుతున్నారు.
End of Article