Ads
ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, ముఖ్య పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, ఇప్పుడు చారి 111 సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : చారి 111
- నటీనటులు : వెన్నెల కిషోర్, మురళీ శర్మ, సంయుక్త విశ్వనాథన్.
- నిర్మాత : అదితి సోని
- దర్శకత్వం : టిజి కీర్తి కుమార్
- సంగీతం : సైమన్ కె కింగ్
- విడుదల తేదీ : మార్చి 1, 2024
స్టోరీ :
ప్రసాద్ రావు (మురళీ శర్మ) ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. దేశంలో జరిగే కొన్ని పనులని ఆపడానికి, ఆ పనుల నుండి దేశాన్ని కాపాడడానికి, ముఖ్యమంత్రి, ప్రసాద్ రావు నేతృత్వంలోనే రుద్రనేత్ర అనే ఒక ఏజెన్సీని స్థాపిస్తారు. అయితే హైదరాబాద్ లో సూ-సై-డ్ బాం-బ్ అ-టా-క్స్ జరిగే మిషన్ ని డీల్ చేయడానికి ఎవరు ఖాళీగా లేకపోవడంతో, చారి (వెన్నెల కిషోర్) ని నియమిస్తారు. చారి, శ్రీనివాస్ (బ్రహ్మాజీ) అనే వ్యాపారవేత్తని ఈ కేస్ విషయంలో పట్టుకోడానికి వెళ్తాడు. అక్కడ మరొక ఏజెంట్ ఈషా (సంయుక్త) ఒక సూట్ కేసును దొంగలించి తీసుకెళ్తుంది. ఆ క్యాప్సూల్ వెనుక ఉన్న కథ ఏంటి? అసలు ఆ సూట్ కేస్ లో ఏం ఉంది? ఆ ఇంజనీర్ ఎవరు? చారి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా వెన్నెల కిషోర్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది కామెడీ. వెన్నెల కిషోర్ ఎన్నో రకాల పాత్రలు చేసినా కూడా, కామెడీ పాత్రలకి ఎక్కువగా గుర్తింపు లభించింది. కాబట్టి ఈ సినిమాలో కూడా వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో చేసినా కూడా కామెడీ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు. ఆ కామెడీ కొన్ని చోట్ల బాగానే అనిపించినా కూడా, కొన్ని చోట్ల మాత్రం అనవసరంగా కామెడీ పెట్టినట్టు అనిపించింది. దర్శకుడు కీర్తి కుమార్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. కానీ అనవసరమైన చోట్ల కామెడీ పెట్టడం వల్ల అవి జోక్స్ లాగా అనిపించలేదు. సీరియస్ గా వెళ్లాల్సిన సీన్స్ లో కూడా కామెడీ ఉంటుంది.
కానీ కొన్ని సీన్స్ లో మాత్రం కామెడీ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ కూడా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వెన్నెల కిషోర్ చారి పాత్రలో బాగా నటించారు. సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. వాళ్లందరికీ నిడివి తక్కువగా ఉన్నా కూడా గుర్తుండిపోయే పాత్రలు లభించాయి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టైలిష్ గా ఉంది. కొన్ని సీన్స్ లో క్లారిటీ మిస్ అయ్యింది. ఆ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- బాగా గ్రౌండ్ మ్యూజిక్
- కొత్త కథనం
- సెకండ్ హాఫ్ లో ట్విస్ట్
మైనస్ పాయింట్స్:
- అనవసరం లేని చోట్ల వచ్చిన కామెడీ
- కొన్ని సీన్స్ లో మిస్ అయిన క్లారిటీ
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సరదాగా అలా నవ్వుకొని రావడానికి ఏదైనా సినిమా చూద్దాం అని అనుకునే వారికి, చారి 111 సినిమా ఒక్కసారి చూడగలిగే కామెడీ స్పై ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :
End of Article