Ads
కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరీయల్ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. జనం ఆమె యాక్టింగ్‌కు టీవీలకు అతుక్కుపోతున్నారు.మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు.
Video Advertisement
మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు. అసలు అది సీరియల్ అనే సంగతే మరిచిపోతున్నారు. కార్తీకదీపంలో వంటలక్కను డాక్టర్‌బాబు ఇబ్బందిపెడుతుంటాడు. ఆమెను ప్రతి సందర్భంలోనూ తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. వంటలక్కను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు డాక్టర్ బాబు అంటూ… టిక్ టాక్‌లో డాక్టర్‌బాబుకు స్పెషల్ రిక్వెస్ట్‌లు, సలహాలు, సూచనలు ఇస్తూ వంటలక్క కోసం మొరపెట్టుకుంటున్నారు.
సీరీయల్ ప్రభావం మరీ ఇంత ఉందా అని కొందరు, అవును ఆ సీరీయల్ బావుంటందని కొందరు, ఇంట్లో వాళ్లతో అలవాటైపోయింది. తప్పటం లేదు కానీ బాగానే ఉంటుందని కొందరు కార్తీకదీపం సీరీయల్‌పై వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే నటుడు వెన్నెల కిషోర్ కూడా ఈ సీరియల్ పై ఆసక్తికర ట్వీట్ చేసారు. “ఎందుకమ్మా అంత మంచి డాక్టర్ బాబు కి ఇంత మంచి వంటలక్క అంటే కోపం” అని ట్వీట్ చేసారు. “త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు” అంటూ స్టార్ మా రిప్లై ఆకట్టుకుంటుంది.
అంతేకాదు ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ కూడా రిప్లై ఇచ్చారు.
Adi maa writer(s) chesina maayajaalam..
Director visirina bandhaala jaalam..
Producer ki deepam ante pranam..
Maa katha ki ade balam..
prekshakulu kuripinche abhimaanam..
Maaku Ade aasirvadam..
Mee tweet choosi modata aascharyam..
Taruvatha Perigindi aanandam..
అంటూ డాక్టర్ బాబు (నిరుపమ్) రిప్లై ఇచ్చారు.
End of Article