పవన్ కళ్యాణ్, శ్రీజ 4 పెళ్లిళ్లు చేసుకుంటారా..? వైరల్ అవుతున్న “వేణు స్వామి” కామెంట్స్..! (వీడియో)

పవన్ కళ్యాణ్, శ్రీజ 4 పెళ్లిళ్లు చేసుకుంటారా..? వైరల్ అవుతున్న “వేణు స్వామి” కామెంట్స్..! (వీడియో)

by Mohana Priya

Ads

గత కొద్ది రోజుల నుంచి మెగాస్టార్ రెండవ కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చల్లో నిలిచాయి. శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుండి విడిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడం గత కొంత కాలం నుండి వారిద్దరు కలిసి ఒక పిక్చర్ కూడా సోషల్ మీడియాలో షేర్ అవకపోవడం వల్ల ఈ విషయంపై అనుమానాలు ఇంకా పెరిగాయి.

Video Advertisement

అంతే కాకుండా కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా ప్రమోషన్స్ కి ఏ ఒక్క మెగా హీరో కూడా మద్దతు తెలపలేదు. దాంతో వారిద్దరూ విడిపోయారు ఏమో అని అందరూ అనుకుంటున్నారు.

pawan 2

ఇదిలా ఉండగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో వేణు స్వామి చాలా విషయాల మీద మాట్లాడారు. అలాగే నరేష్ కి సంబంధించిన విషయంపై కూడా మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ వేణు స్వామి పవన్ కళ్యాణ్, శ్రీజకి సంబంధించి ఒక విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ కి నాలుగు పెళ్లిళ్లు అవుతాయి అని ఆయన జాతకంలో అలా ఉంది అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కి వరసకి కూతురు అయిన శ్రీజకి కూడా నాలుగు పెళ్లిళ్లు అవుతాయి అని చెప్పారు.

అయితే వేణు స్వామి ఈ విషయంపై మాట్లాడుతూ ఇదంతా వారి వ్యక్తిగతం అని, వారు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు? లేదా మిగిలిన విషయాలు అన్నీ కూడా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి అని, దీనిపై సమాజం మాట్లాడే అర్హత లేదు అని అన్నారు. సెలబ్రిటీల జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆ విషయం జనాల మీద ప్రభావం పడే అవకాశం లేదు అని చెప్పారు. ప్రస్తుతం వేణు స్వామి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like