చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు వేణు తొట్టెంపూడి. ఎన్నో సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. వేణు చివరిగా 2013లో విడుదలైన రామాచారి అనే సినిమాలో నటించారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు వేణు మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

venu thottempudi to make his comeback

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు వేణు. ఈ విషయాన్ని సినిమా బృందం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. శరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మజిలీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్, అలాగే తమిళ్, మలయాళం సినిమాల్లో నటించిన రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.