రాసుకోండంటూ.. అల్లు అర్జున్ సినిమాలపై జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన కామెంట్స్..!

రాసుకోండంటూ.. అల్లు అర్జున్ సినిమాలపై జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన కామెంట్స్..!

by Sunku Sravan

Ads

సినీ తారల జాతకంపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మరొకసారి నోరు విప్పారు. ఉగాది పండుగ సందర్భంగా ఆయన సినీ తారల గురించి జాతకం చెప్పారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి ఆయన ఏమన్నారో తెలుసుకుందాం..? ఉగాది నుంచి మనకు కొత్త ఏడాది ప్రారంభం అయింది. దీంతో పలువురు స్టార్ సినీ నటులు వారి యొక్క భవిష్యత్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

Video Advertisement

సినీతారల జాతకం చెప్పే వేణు స్వామి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం..? సాధారణంగా ఎక్కువ ఎవరైతే పబ్లిక్ డొమైన్ లో ఉంటారో వారి గురించే ప్రజలకు మాట్లాడే సాధారణ హక్కు ఉంటుంది.

venuswamy

దీన్ని ఎవరూ కూడా కాదనలేరు. మనం వద్దనడానికి లేదు. ఈ శుభ కృత నామ సంవత్సరంలో ఇద్దరు తెలుగు అగ్రహీరోలకు సంబంధించి సంచలనమైన వార్తలు వింటారని, వారి పేర్లను నేను చెప్పను కానీ, వారికి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కలగవచ్చు అన్నారు. వారు ఇప్పటివరకు ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సల్ కావచ్చని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జాతకం ఉన్న హీరో అల్లు అర్జున్. రాబోయే ఐదు సంవత్సరాలలో కూడా ఆయన జాతకంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన తీసే సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో మినిమమ్ రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్ ను చేస్తాయని తెలియజేశారు.

venuswamy 2

దీన్ని మీరు రాసి పెట్టుకొండి అని, 200 కోట్లకు దాటుతాయి తప్ప తగ్గదని, టాలీవుడ్ లో ఆయన బంగారు బాతు అని వేణు స్వామి తెలియజేశారు. ఈ తరుణంలో ఇద్దరు స్టార్ హీరోలలో ఒక్కరికి ఆరోగ్య సమస్యల వల్ల సినిమా కూడా ఆగిపోయే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే ఇద్దరు పెద్ద హీరోల గురించి సంచలన విషయాలు బయటకు వస్తాయని అన్నారు. వారికి సంబంధించి వేణు స్వామి మాట్లాడారు కానీ పేర్లు మాత్రం చెప్పలేదు. ఈ విధంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రంగా తప్పు పడుతున్నారు.


End of Article

You may also like