Ads
ప్రముఖ సీనియర్ నటులు మన్నవ బాలయ్య ఇవాళ కన్నుమూశారు. యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య 300కు పైగా సినిమాల్లో నటించారు.
Video Advertisement
బాలయ్య గొప్ప నటులు మాత్రమే కాదు నిర్మాత, దర్శకులు అలాగే కథా రచయిత కూడా. ఊరికిచ్చిన మాట అనే సినిమా కోసం ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు.
అలాగే ఈ సినిమాకి ఉత్తమ నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. ఎత్తుకు పై ఎత్తు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాలయ్య. తర్వాత ఇరుగుపొరుగు, బొబ్బిలి యుద్ధం, పాండవ వనవాసం, మొనగాళ్ళకు మొనగాడు, అల్లూరి సీతారామరాజు, పెద్దరికం వంటి సినిమాల్లో నటించారు. అలాగే మన్మధుడు, అన్నమయ్య, మల్లీశ్వరి, యమలీల వంటి సినిమాల్లో కూడా నటించారు. బాలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
End of Article