“పెదరాయుడు” నటి ఇక లేరు.!

“పెదరాయుడు” నటి ఇక లేరు.!

by Mohana Priya

Ads

ప్రముఖ సినీ నటి జయంతి గారు చివరి శ్వాస విడిచారు. జయంతి గారు కర్ణాటకలోని బళ్లారి కి చెందిన వారు. 1960 లో ఒక తమిళ సినిమాతో బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జయంతి గారి అసలు పేరు కమలకుమారి. కన్నడ దర్శకుడు వై ఆర్ స్వామి జయంతి గారి పేరుని మార్చారు. జయంతి గారు తెలుగు కన్నడ తమిళం మలయాళం హిందీ మరాఠీ భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు.

Video Advertisement

తెలుగులో బొబ్బిలి యుద్ధం కులగౌరవం పెదరాయుడు కొండవీటి సింహం జగదేకవీరుని కథ జస్టిస్ చౌదరి వంటి సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటిగా ఉత్తమ సహాయ నటిగా ప్రెసిడెంట్ మెడల్ అలాగే రెండు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు జయంతి గారు. కర్ణాటక ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదుతో జయంతి గారిని సత్కరించింది. 1998లో లోక్ సభ ఎన్నికల్లో లోక్ శక్తి పార్టీ తరపున పోటీ చేశారు జయంతి. కానీ విజయం సాధించలేదు. జయంతి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like