ఈ కారణంగానే “కేకే” చనిపోయారా..? వైరల్ అవుతున్న వీడియో..!

ఈ కారణంగానే “కేకే” చనిపోయారా..? వైరల్ అవుతున్న వీడియో..!

by Sunku Sravan

Ads

ప్రముఖ సింగర్ కేకే మృతి పట్ల దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. కేకే హిందీతో పాటుగా దాదాపుగా అన్ని భాషల్లో అత్యద్భుతమైన పాటలు పాడి ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసిన ఆయన మరణ వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Video Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే బహుముఖ సింగర్ గా పేరు సంపాదించుకున్న కేకే మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు, కేకే రొమాంటిక్ పాటల నుంచి మొదలు ఉర్రూతలూగించే పాటల వరకు అన్ని రకాల సాంగ్స్ పాడారు.

ఆయన ఏ సాంగ్ పాడిన అంకితభావంతో పని చేస్తారని పేరు ఉంది. ఆయన గొంతు నుంచి వెలువడిన ఏ పాట అయినా మంచి గుర్తింపు పొందింది. కోట్ల మంది భారతీయుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కే కే. 53 సంవత్సరాల వయసులో మన అందరికీ దూరమయ్యారు. కోల్కతాలోని ఒక కళాశాలలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

మరి ఆయన అలా అస్వస్థతకు గురి కాగానే అక్కడున్న వారు ఏం చేశారో ఓ సారి చూద్దాం..? ఆయన స్క్రీన్ పై పర్ఫామెన్స్ ఇస్తున్న సమయంలోనే కనీస వసతులు లేక ఎంతో ఇబ్బంది పడ్డారని, కనీసం ఏసి లేక చెమటలు పడుతుంటే వాటిని తుడుచుకుంటూ ప్రదర్శన ఇచ్చారని పలువురు అంటున్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని, కానీ అక్కడ ఉన్నవారు కేకేను నడిపించుకుంటూ ముందుగా ఆయనను హోటల్ రూమ్ కి తీసుకెళ్లారని తెలుస్తోంది.

ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. అతను గుండెపోటుకు గురి కాగానే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కావచ్చని, ఆయన చనిపోయి ఉండేవారు కాదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో, లేదో మనకు తెలియదు కానీ, ఆయన అస్వస్థతకు గురైన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బ్రతికేవాడు కావచ్చని కొంతమంది అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలాగే రాత్రి 10 గంటలకు హాస్పిటల్ కి తీసుకు వెళ్లారని అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారని ఆస్పత్రి అధికారులు తెలియజేశారు. అయితే కేకే ముఖం మీద మరియు తలమీద గిసుకుపోయిన గాయాలు ఉన్నాయని, అయితే హోటల్ గదిలో ఆయన పడిపోయినప్పుడు ఆ గాయాలు అయి ఉండవచ్చని అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, భార్య జ్యోతి కృష్ణ, కూతురు తామర, కుమారుడు నకుల్ ఢిల్లీ నుండి విమానంలో కోల్కత్తా చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారని సమాచారం. ఆయన మృతిపై పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.


End of Article

You may also like