మన భారతదేశం అంటేనే మొట్టమొదట గుర్తొచ్చేది మనం పాటించే సంప్రదాయాలు. మనం ఆచరించే పద్దతుల్లో చాలా విషయాలకు మనకి అర్థం తెలిసి ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం ఎందుకు పాటిస్తున్నారో తెలియకుండానే పాటిస్తాము. కొన్నిటిని మాత్రం కొంత మంది పద్ధతి అని అనుకుంటే, మరికొందరు మాత్రం అలాంటివి ఉండవు అని అంటూ ఉంటారు.video of a boy sitting in boiling water goes viral

ఈ విషయంపై జరిగే చర్చలకి ఎప్పటికీ ఒక ముగింపు అనేది ఉండదు. అయితే, ఇటీవల ఇలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై చర్చ మొదలయ్యి, కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే, పెద్ద గిన్నెకి మంట పెట్టి ఉంది. అందులో నీళ్ళు మరుగుతుండగా ఆ నీటిలో ఒక బాలుడు అలాగే కూర్చున్నాడు. ఆ మంట మెల్లగా పెరుగుతూనే ఉంది. అయినా సరే ఆ బాలుడు మాత్రం కదలకుండా అలాగే కూర్చున్నాడు.video of a boy sitting in boiling water goes viral

ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఏమో అది డబల్ కోటెడ్ గిన్నె. ఆ గిన్నెకి వేడి తగలదు అని అంటూ ఉంటే, ఇంకొంతమంది ఏమో ప్రస్తుతం భారతదేశం పరిస్థితి ఇలా ఉంది అని అంటున్నారు. మరి కొంతమందేమో అసలు ఆ వీడియో ఇప్పటిది కానే కాదు, కొన్ని సంవత్సరాల క్రితంది అని అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

watch video :