సోషల్ మీడియాలో తరచూ మనకి చాలా రకాల వీడియోలు కనబడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరు కూడా రీల్స్ వంటివి చేయడం సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వంటివి చేస్తూ వుంటున్నారు. వాటిలో ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి.

Video Advertisement

ఈ ఫన్నీ వీడియోలను చూస్తే మనం అసలు నవ్వు ఆపుకోలేము. పైగా ఇతరులని కూడా చూడమని షేర్ చేస్తూ ఉంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.

అది చూసి ఎవరికి నచ్చిన రీతి లో వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే… ఒక అమ్మాయి తన తలని దువ్వుకుంది. ఆ తర్వాత జుట్టుకి దువ్వెన చిక్కుకుపోయింది. ఆమె కష్టాన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. blackie_memeash అనే పేరు తో ఉన్న ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి ఈ వీడియోని షేర్ చేశారు. ఒక చిన్నారి తల లో దువ్వెన చిక్కు పడిపోయింది.

దాంతో ఆమె ”ఫ్రెండ్స్ చూడండి నా వెంట్రుకలలో దువ్వెన చిక్కుకు పోయింది బాగా నొప్పి వస్తోంది” అని తన బాధని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇదంతా కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఆమె కష్టం చూసి వివిధ రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. ఆమె అయోమయ స్థితి ని చూసి రకరకాలుగా కామెంట్లు వచ్చాయి. ఇప్పటికి ఈ వీడియోని దాదాపు 72 లక్షల మంది చూశారు. మూడు లక్షల ఎనభై వేల లైకులు వచ్చాయి.

ఈ వీడియోకి ఒక యూజర్ ”అమ్మ దగ్గరికి వేళ్ళు.. ఒక్కటి కొడితే అంత సెట్ అయిపోతుందని” కామెంట్ చేశారు. మరొక యూజర్ అయితే ”ఒకసారి నాకు ఇలానే జరిగింది. నిదానంగా తీస్తే తీస్తే వచ్చేస్తుందని” కామెంట్ చేశారు. ”పగవాడికి కూడా రాని కష్టం ఇది. ఈ చిన్నారికి చాలా నొప్పిగా ఉంటుంది మిత్రులారా లైక్ చేసి ఫాలో ఇవ్వండి” అని కామెంట్ చేశారు ఇంకో యూజర్.