Home Filmy Adda Balakrishna : అక్కడ కూడా మన బాలయ్య డామినేషనే..! వీడియో వైరల్..!

Balakrishna : అక్కడ కూడా మన బాలయ్య డామినేషనే..! వీడియో వైరల్..!

by Mohana Priya

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

video of akhanda craze in dallas goes viral

బాలకృష్ణకి కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, వేరే చోట్ల కూడా చాలా క్రేజ్ ఉంది. అందులోను ముఖ్యంగా యూఎస్ వంటి దేశాల్లో మన సినిమాలకి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అఖండ రిలీజ్ సందర్భంగా డల్లాస్ లో కొంత మంది తెలుగువాళ్లు సినిమా రిలీజ్ ని ఒక సెలబ్రేషన్ లాగా చేసారు. సినిమా రిలీజ్ తర్వాత ర్యాలీ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video : 

You may also like