వద్దు మేడం అంటున్నా వినకుండా ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన టిక్ టాక్ స్టార్…వైరల్ వీడియో!

వద్దు మేడం అంటున్నా వినకుండా ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన టిక్ టాక్ స్టార్…వైరల్ వీడియో!

by Megha Varna

హర్యానా కు చెందిన బీజేపీ నాయకురాలు మరియు ప్రముఖ టిక్ టాక్ స్టార్ అయిన సోనాలి ఫోగాట్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టారు.ఆ అధికారి ఆగమని ఎంత బతిమాలినా ఆగకుండా కొడుతూనే ఉన్నారు సోనాలి ఫోగాట్.కాగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

రైతుల సమస్యల గురించి చర్చించడానికి సోనాలి ఫోగాట్ ప్రభుత్వ అధికారి అయిన సింగ్ దగ్గరకి వెళ్లారు.అయితే ఆ సమయంలో సింగ్ కొన్ని అసభ్య పదజాలంతో మహిళల ఆత్మగౌరవాన్ని క్షించపరిచే విధంగా మాట్లాడాడని అందుకే ఇలా కొట్టాల్సి వచ్చింది అని సోనాలి ఫోగాట్ తెలిపారు.నీకు బతికే హక్కు లేదు అంటూ సోనాలి ఫోగాట్ ప్రభుత్వ అధికారిని కొట్టడం మనం వీడియోలో చూడచ్చు.అయితే నేను సింగ్ ను కొట్టినందుకు ఏమి తప్పుగా అనుకోవడం లేదని సోనాలి ఫోగాట్ తెలిపారు.ఇప్పుడు నేను కొట్టకపోతే వేరే మహిళలతో కూడా ఇలాగె ప్రవర్తిస్తారని సోనాలి ఫోగాట్ తెలిపారు.అనంతరం సింగ్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు సోనాలి ఫోగాట్.

అయితే ఈ సంఘటనపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియాలో స్పందిస్తూ ..మార్కెట్ ఉద్యోగిని పశువును కొట్టినట్లు కొట్టారు ..ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడం నేరమా అంటూ ప్రశ్నించారు.కాగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అయిన సోనమ్ అలా కొట్టడం సరైనది కాదు ఒకవేళ ఏమైనా ఉంటె ఉన్నతాధికారులకో లేదో పోలీసులకైనా సమాచారం అందించాలి అంతేగాని చట్టాన్ని ఇలా చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


You may also like