Home Filmy Adda Jr NTR : ఫాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ స్వీట్ వార్నింగ్..! వైరల్ అవుతున్న వీడియో..!

Jr NTR : ఫాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ స్వీట్ వార్నింగ్..! వైరల్ అవుతున్న వీడియో..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కొన్ని సీన్స్ లో కనిపిస్తారు.

video of ntr warning his fans in rrr event goes viral

సినిమా బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల ముంబైలో ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌కి గెస్ట్‌లుగా కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ వచ్చారు. అంతే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు అక్కడకి వెళ్ళారు. ఈవెంట్ మధ్యలో ఫ్యాన్స్ అరడవడం మొదలు పెట్టారు. బారికేడ్ లని కూడా తోసుకొని రావడానికి ప్రయత్నించారు. దాంతో ఎన్టీఆర్ అందరినీ కిందకి దిగమని, రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చామని, ఇక్కడ ఇలా చేయడం పద్ధతి కాదు అని, అలా చేయొద్దని, ఆగమని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

https://twitter.com/ManofMassesNTR/status/1472821298237624321

You may also like