“పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆనందంగా లేకపోవడానికి కారణం నువ్వే..!” అంటూ.. వైరల్ అవుతున్న “సమంత” కామెంట్స్..! (వీడియో)

“పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆనందంగా లేకపోవడానికి కారణం నువ్వే..!” అంటూ.. వైరల్ అవుతున్న “సమంత” కామెంట్స్..! (వీడియో)

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే తమిళ్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా, నయనతార మరో హీరోయిన్ గా నటించారు. సమంత ఇప్పుడు యశోద సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం కి అతిథిగా వెళ్లారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో సమంత మాట్లాడుతూ, “చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు వారి పెళ్లి జీవితంలో ఆనందంగా ఉండకపోవడానికి కారణం నువ్వే” అని కరణ్ జోహార్ ని అన్నారు. “మీ సినిమాలు చూసి K3G (కభీ ఖుషీ కభీ గమ్) లాగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం కేజీఎఫ్ లాగా ఉంటుంది” అని అంటున్నారు. సమంత ఈ ప్రోగ్రామ్ లో హీరో అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి కరణ్ జోహార్ ప్రొడక్షన్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేస్తారు, అది ఈ ప్రోగ్రాంలో ప్రకటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.

watch video :


End of Article

You may also like